Thursday, November 3, 2011

గుడుంబా శంకర్--2004

సంగీతం::మణి శర్మ
రచన::చంద్రబోస్
గానం::కార్తీక్,శ్రీ వర్ధిని,హనుమంత రావు

దరె దా దరె నా దిర నా దిరె నా
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ
అరె ఆశే ఉంటే అంతొ ఇంతొ అందేనండీ
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండీ
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండీ
మన పర బ్రహ్మం మళ్ళి అంటు ఉన్నాడండీ
ఉందొయ్ రాసీ లేదొయ్ రాజీ
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ

సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పొయినా అయ్యే పెళ్ళాగనా రాసే ఉంటే
చల్లే అక్షింతలు నిప్పులే అయినా పెళ్ళాగదు రాసే ఉంటే
మెళ్ళొ పూమాలలు పాములె అయినా పెళ్ళాగదు రాసే ఉంటే
ఉందొయ్ రాసీ బద్దోయ్ పేచీ
చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుందీ
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుందీ

తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటె
గురుడే బొధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటె
సింఘమో పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళమో పక్క బళ్ళెం ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
ఉందోయ్ రాసీ బ్రతుకే చీచీ
అరె ఆశే ఉంటే అంతొ ఇంతొ అందేనండీ
మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండీ
ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండీ
మన పర బ్రహ్మం మళ్ళి అంటు ఉన్నాడండీ
ఉందొయ్ రాసీ లేదొయ్ రాజీ

No comments: