Thursday, October 13, 2011

దడ -- 2011




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::ఆండ్రియా,కళ్యాణ్

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని
ఒంటరి పిల్లోడా అలే తుంటరి పిల్లోడా అలే
వద్దకు లాగెయ్ రా అలే వజ్రాన్ని


దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని

ఊరించే నిషాని
ఊపిరి పోసే విశాన్ని
నెత్తురు లోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని
అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంధాన్ని

చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే
చూడర బుల్లోడా అలే అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్ళు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాళి దీపాన్ని
సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ
సల సల హాయిగ సరసున రాయిగ
కదిలించావుగ ప్రాయం పొంగేట్టు
ముందుకు వస్తావో నాతొ పొత్తుకు వస్తావో
ఎటో ఎట్టుకుపోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఒప్పనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: