మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా
చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటనీ మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూశా నీతో సాగే పూలబాటని నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ మనసా....మాటాడమ్మా
తల్లీ తండ్రి నేస్తం ఏ బంధమైనా అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా తనువూ మనసూ ప్ర్రాణం నీవైన రోజునా నాదని వేరే ఏదీ మిగిలి లేదుగా ఎగసే కెరటాల కడలి కలుపుకున్నవెనుక ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా నీవు లేని లోకమింక నాకుండదంటూ
No comments:
Post a Comment