Monday, April 13, 2009

కాళీదాసు-2008



సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
డైరెక్టర్::రవిచంద్ర,G.రెడ్డి
ప్రొడుసర్::చింతలపుడి శ్రీనివాస్,A.నాగ సుశీల

ఎల్లకే ఎల్లకే మల్లెతోటకెల్లకే
మల్లెపూలు నిన్ను చూసి కుళ్ళుకుంటయే
ఎల్లకే ఎల్లకే పళ్ళతోటకెల్లకే
పళ్ళు నిన్ను చూసి నోళ్ళు ఎళ్ళబెడతయే
ఎల్లకే ఎల్లకే బళ్ళోకి ఎల్లకే
పోరగాండ్ల సదువు సత్తు బండలైతదే
ఎల్లకే ఎల్లకే గుళ్ళోకి ఎల్లకే
దేవుళ్ళకి కళ్ళు బైర్లు కమ్ముకుంటయే

ఎల్లనోయ్ ఎల్లనోయ్ ఎక్కడికీ ఎల్లనోయ్
నీ ఒక్క ఇల్లు నేను కట్టుకుంటనోయ్
ఎల్లనోయ్ ఎల్లనోయ్ ఎప్పటికీ ఎల్లనోయ్
నా ఒంటికి గొళ్ళమేసి చుట్టుకుంటనోయ్

ఎల్లకే ఎల్లకే ...మల్లెతోటకెల్లకే
ఎల్లకే ఎల్లకే పళ్ళతోటకెల్లకే
పళ్ళు నిన్ను చూసి నోళ్ళు ఎళ్ళబెడతయే

నువ్వు సరుకులకై షాపుకెల్తే నీలోని సరుకు చూసి షాపోడు షాకు తింటడే
నువ్వు బట్టలకై కొట్టుకెల్తే నీ బాడి చూసి వాడు బతికి ఇంక బట్టకట్టడే
బంగారపు దుకానానికెల్లకే ఎల్లకే
నీ బుగ్గలు చూసి వాళ్ళు బొగ్గులై పోతరే
షాపుకెల్లనోయ్ ఏ కొట్టుకెల్లనోయ్
బంగారమెందుకోయ్ బంగ్లాలు ఎందుకోయ్
నీ తాత అప్పు కట్టినాక (???)
నువ్వు నాకు పక్కనుంటే తక్కువేమిటోయ్
మా మా మామరే బాబా బాబరే
మా మా మామరే బాబాబా
మా మా మామరే బాబాబాఏ

నువ్వు పిండిగిర్నికెల్లగానే నీ పొంగులు చూసినోళ్ళ గుండే పిండి పిండి అయితదే
నువ్వు మార్కెట్టికి ఎల్లగానే నీ మెరుపుకి కూరగాయ రేట్లే రెట్టింపు అవుతయే
నీళ్ళ పంపుకాడికి ఎల్లకే ఎల్లకే
వేళ్ళు తగిలి నీళ్ళన్నీ నిప్పులై పోతయే
పిండి ఎందుకోయ్ ఏ తిండి ఎందుకోయ్
ఆ నీళ్ళు ఎందుకోయ్ మరి నిప్పులెందుకోయ్
అరె చార్మినారు లాంటి నీ ఛాతి మీద చాప వేసి నిదురపోతనోయ్

ఎల్లకే ఎల్లకే ఎల్లకే ఎల్లకే
ఎల్లకే ఎల్లకే మల్లెతోటకెల్లకే
ఎల్లకే ఎల్లకే పళ్ళతోటకెల్లకే
పళ్ళు నిన్ను చూసి నోళ్ళు ఎళ్ళబెడతయే
ఎల్లకే ఎల్లకే బళ్ళోకి ఎల్లకే
పోరగాండ్ల సదువు సత్తు బండలైతదే
ఎల్లకే ఎల్లకే గుళ్ళోకి ఎల్లకే
దేవుళ్ళకి కళ్ళు బైర్లు కమ్ముకుంటయే

No comments: