Monday, April 6, 2009

చింతకాయల రవి 2008


సంగీతం::విశాల్,శేఖర్
రచన::చంద్రబోస్
గానం::సోనునిగమ్,మహాలక్ష్మి అయ్యర్


ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడు తెలియంది ఎందుకో నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు భరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో

చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేకలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనలోన మునిగేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో

ఆ ఊరు ఈ ఊరు వేరైనా ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను ఏడున్నా ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె ఆ తలపులోనె తల మునకలాయె మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన తనువులోన అణువణువులోన మధువనములోన ప్రతి కణములోన కలిసేందుకా

ఎందుకో తొలి తొందరెందుకో నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
సొగసులకు ఈ రోజు భరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేక లోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చెలించా అందుకా
తన నవ్వులోన సిరి వానలోన విరి కోనలోన చిరు తేనలోన మునిగేందుకా

No comments: