Sunday, February 15, 2009

ఒంటరి~~2008



సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::SP.చరణ్,కల్పన

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా


గుండెలయలో..ఓ ఓ ధీంతధిరనా
ఎన్ని కధలో..ప్రేమవలనా
హాయి అలలో..ఓ ఓ ఊయలవనా
రేయినదిలో..జాబిలవనా
నీ ప్రేమలోనే మేలుకుంటున్నా
మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా

వెంటనడిచే..ఓ ఓ నీడననుకో
జంటనడిపే..జాడననుకో
పూలు పరిచే..ఓ ఓ దారిననుకో
నిన్ను కలిసే..బంధమనుకో
నా ప్రేమలోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్థమేనన్నా
ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా
చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

పెదవే కదిలించుకో..మనసే వినిపించుకో
పరదా తొలగించు కొంతైనా
సరెలే అనిపించుకో..త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా

చెప్పాలనుంది చిన్నమాటైనా..ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

ఒంటరి~~2008



సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::హేమచంద్ర,మాళవిక

అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ


తనువంతా పులకిస్తున్నది..చిగురాకై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నది..మనసు ఎందుకో మరీ

నీలాగే నాకూ ఉన్నది..ఏదేదో అయిపోతున్నది
నా ప్రాణం నువ్వంటున్నది..మనసు ఎందుకే ప్రియా మరి మరి


అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ


లేత పెదవుల తీపి తడీ..మొదటి ముద్దుకు ఉలికిపడీ మేలుకున్నదీ
ఎడమవైపున గుండెసడీ..ఎదురుగా నీ పిలుపు వినీ వెల్లువైనదీ

తొలి వెన్నెలంటే తెలిపిందీ..నీ జతలో..చెలిమీ
తొలి వేకువంటె తెలిసిందీ..నీ చెయ్యే..తడిమీ


అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ


కనులు చూసిన తొలివరమూ..కలలు కోరిన కలవరమూ నిన్నలేదిదీ
చిలిపి సిగ్గుల పరిచయమూ..కొంటె నవ్వుల పరిమళమూ మత్తుగున్నదీ

మన మధ్య వాలి చిరుగాలి..నలిగిందే..పాపం
పరువాల లాలి చెలరేగీ..చెరిగిందే..దూరం


అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ

Wednesday, February 11, 2009

శశిరేఖా-పరిణయం~~2008



సంగీతం::మణిశర్మ
రచన::అనంత శ్రీరామ్మ్
గానం::జై శ్రీనివాస్,మాళవిక


ఓ గుండెల్లో గోలీసోడా..బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా..ఝలక్కు రావాలంతే
కళ్ళల్లో కోకా కోలా..కస్సంటూ పైకొస్తుంటే
చూపుల్లో సంతోషాలా..చమక్కు చిందాలంతే

ఓ మెరుపుల్లో ఉయ్యాలూగే మురిపెం నాకొచ్చిందంటే
మేఘాలే నాదగ్గరికీ..ఉరుక్కు వస్తాయంతే

డిలక్ డిలక్ డీలాలా..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా..అడక్కుమళ్ళా 2

ఓ గుండెల్లో గోలీసోడా..బుస్సంటూ పొంగిందంటే
వళ్ళంతా ఆడా ఈడా..ఝలక్కు రావాలంతే

తుళ్ళే తువ్వాయిలా ఆటల్లో..తుళ్ళింతే రమ్మందీ నన్నీరోజూ
చిన్నీ చిల్లాయిల కూతల్లో..లల్లాయి వింటుంటే ఎంతో మోజు

పసిపాపాయికి రుసుమెంతివ్వనూ..తనకేరింత కాసింత నేర్పేందుకూ
నదిలో చేపకీ ముడుపేమివ్వనూ..తనతో పాటు ఆ లోతు చూపేందుకూ

డిలక్ డిలక్ డీలాలా..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా..అడక్కుమళ్ళా 2

పచ్చా ఓణీలను చేనమ్మా..చుట్టూరా చుట్టింది ఈ పల్లెల్లో
ఎన్నో వర్ణాలతో సందెమ్మా..కళ్ళాపే చల్లింది ఆకాశంలో
అటు ఓ అందమూ..ఇటు పూగంధమూ
ఎటు వెళ్ళాలి పాదాలు తూనీగలై
సరదా సంపదా..వెనకేసేందుకూ
ఒకటే జన్మ నాకుంది ఈ నేలపై

డిలక్ డిలక్ డీలాలా..డిలక్ డిలక్ డీలా
కొలిక్కిరాదిక ఈ గోలా..అడక్కుమళ్ళా 2

శశిరేఖా-పరిణయం 3~~2008



సంగీతం::విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::సైధవి

ఏదో..వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పనంటుంది నా మౌనం
ఉరికి వస్తుంటే సంతోషం..
అదిమి పెడుతుందే ఉక్రోషం..
తన వెనుక నేనూ..నా వెనుక తానూ..
ఎంత వరకీ గాలి పయనం
అదాగదే ఉరికే ఈ వేగం
ఎదో..ఎదో..ఏదో..ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది నా మౌనం


ముందునా బుగ్గలు చిదిమిందా
మెల్లగా సిగ్గులు కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా


ముందునా బుగ్గలు చిదిమిందా
మెల్లగా సిగ్గులు కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏందేందో...
వయసుకేమి తెలిపిందో...
చిలిపి కబురు ఏందేందో...
వయసుకేమి తెలిపిందో...
ఆదమరుపో..ఆటవిడుపో..
కొద్దిగా నిలబడి చూచా.....
ఓ..క్షణం..
అంటే...కుదరదంటుంది నా ప్రాణం
కాదంటే...ఎదురు తిరిగింది నా హౄదయం..


Shashirekhaa Parinayam--2008
Music::Vidya Sagar
Lyrics::Sirivennela
Singer::Saidhavi
:::

EdO EdO oppukOnandi naa praaNam
adi EdO cheppananTOndi naa mounam
ubiki vastunTE santOsham
adimi peDutOndE ukrOsham
tana venuka nEnu
naa venuka taanu
enta varakee gaali payanam
aDagadE urikE ee vEgam
EdO EdO oppukOnandi naa praaNam
adi EdO cheppananTOndi naa mounam

:::1

mullulaa bugganu chidimindaa.
mellagaa siggunu kadipindaa
vaanalaa manasunu taDipindaa
veeNalaa tanuvunu taDimindaa ||2||
chilipi kaburulEm vindO
vayasukEmi telisindO ||2||
aadamarupO aaTaviDupO
koddigaa nilabaDi chooddaam
O kshaNam anTE kudaradanTOndi naa praaNam

valadanTE eduru tirigindi naa hRdayam..

శశిరేఖా-పరిణయం 2~~2008



సంగీతం::విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::సైధవి

అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా
నేస్తమై వచ్చే నీడైన నిందలేస్తుందే నాపైన
అందరూ నడిచే దారైనా అడవిలా మారిందనుకోనా
నేస్తమై వచ్చే నీడైన నిందలేస్తుందే నాపైన
కంటపడని శత్రువులా..సొంతమనసు ఎందుకిలా
కంటపడని శత్రువులా..సొంతమనసు ఎందుకిలా
కచ్చగడుతూ..రెచ్చగోడుతూ..
ఇంత వేదించే గాయం...ఏమిటో..
ఏ..మో..తెంచుకోలేని అనుమానం తెలుసేమో...
బైట పడలేని అభిమానం....


ఏదో..వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈవైనం
కలత పడుతుంది లోలోన..కసురుకొంటుంది నాపైన
తన గుబులు నేనూ..నా దిగులు తానూ
కొంచమైనా పంచుకొంటే..తీరిపోతుందేమో భారం
ఎదో..ఎదో..ఏదో..ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈ వైనం

శశిరేఖా-పరిణయం 1~~2008



సంగీతం::విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::సైధవి

ఏదో..వప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈవైనం
కలత పడుతుంది లోలోన..కసురుకొంటుంది నాపైన
తన గుబులు నేనూ..నా దిగులు తానూ
కొంచమైనా పంచుకొంటే..తీరిపోతుందేమో భారం
ఎదో..ఎదో..ఏదో..ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో..చెప్పలేనంది ఈ వైనం


పచ్చగా వున్న పూదోటా..నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకొంటున్నా ఊరంతా గిచ్చినటుందే నన్న్నంతా
పచ్చగా వున్న పూదోటా..నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకొంటున్నా ఊరంతా గిచ్చినటుందే నన్న్నంతా
ఉండలేను నెమ్మదిగా..ఆ..ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా..ఆ..ఎందుకంట తెలియదుగా
తప్పటడుగో..తప్పూనుకో..తప్పలేదేతప్పుకొపోదాం
తక్షణం అంటు..ఊ..పట్టు పడుతుంది ఆరాటం

పదమంటూ..నెట్టుకెడుతుంది నను సైతం..

శశిరేఖా-పరిణయం~~2008



సంగీతం::మణిశర్మ విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::చిత్ర

నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకునీ..కొలువుంచే మంత్రం నీవవనీ


ప్రతీ పూట పువ్వై పుడతా ..నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెల అవుతా..నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ
నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ


వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవూ నువ్వే


రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
ఆ..ఆ ..నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ


ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాశ వీణలోని మధురిమ నీవే సుమా
గంగపొంగు నాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించీ ధారపోయనా
ఆయువంత వెలిగించీ..హారతీయనా
నిన్నే నిన్నే నిన్నే..ఓ..నిన్నే నిన్నే నిన్నే