Saturday, September 5, 2015

స్టూడెంట్ నెం. 1--2001

సంగీతం::కీరవాణి
రచన::చంద్రబోస్ 
గానం::కీరవాణి
Film Directed By::S.S.Raajamouli
తారాగణం::జూనియర్ ఎన్.టి.ఆర్,గజాలా,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి,ఎల్బీ శ్రీరాం,ఎమ్మెస్ నారాయణ,రాజీవ్ కనకాల,సుధ,స్వాతి.

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఓ మై డియర్ గాల్స్..డియర్ బోయ్స్..డియర్ మేడమ్స్..గురుబ్రహ్మలారా 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము..చదువులమ్మ చెట్టు నీడలో 
వీడలేమంటు..వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము..చిలిపితనపు చివరి మలుపులో 
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ  
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ

చరణం::1

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ 
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ 
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ 
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ 
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు..శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు 
కైలాష్ కూసిన కాకి కూతలు..కళ్యాణి వేసిన లెంపకాయలు 
మరపురాని తిరిగిరాని గురుతులండి..మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి..ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ 
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము..చదువులమ్మ చెట్టు నీడలో 
వీడలేమంటు..వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము..చిలిపితనపు చివరి మలుపులో

చరణం::2

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ 
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ 
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ 
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ 
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు..సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు 
బాత్ రూముల్లోన భావకవితలు..క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు 
మరపురాని తిరిగిరాని గురుతులండి..మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి..మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జాయ్..వియ్ మిస్ యూ

No comments: