Thursday, March 22, 2012

మహాత్మా--Mahatma--2009



సంగీతం::విజయ్ ఆంటోని
రచన::సిరివెన్నెల
గానం::బాలసుబ్రహ్మణ్యం

సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ

తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినాననీ
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ

తల వంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం...త్రిలోకాభిరామం
అనన్యం...అగణ్యం...ఏదో పూర్వపుణ్యం
త్రిసంధ్యాభివంద్యం....అహో జన్మ ధన్యం ||తల ఎత్తి||

శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవతి చాలు నీ ప్రఖ్యాతికి ||తల ఎత్తి||

తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ములతపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం ||తల ఎత్తి||

mahaatmaa--2009
Music::vijay^ aaMTOni
Lyrics::sirivennela
Singer's::baalasubrahmaNyaM

siMgammu pai tirugu purusha kaesari SaatavaahanuDu poorvajuDu nee jaatikee

tala etti jeeviMchu tammuDaa
telugu naelalO molakettinaananee
kanuka niluvettugaa ediginaananee

tala vaMchi kaimODchu tammuDaa
telugu talli nanu kani peMchinaadani
kanuka tulalaeni janmammu naadani
trailiMga dhaamaM...trilOkaabhiraamaM
ananyaM...agaNyaM...aedO poorvapuNyaM
trisaMdhyaabhivaMdyaM....ahO janma dhanyaM ||tala etti||

Sree mahaavishNuvae SreekaakuLaaMdhruDai Sreekaaramunu chuTTe nee charitaki
SreeSaila bheemaeSa kaaLaeSuDai haruDu praakaaramu kaTTe nee seemaki
siMgammu pai tirugu purusha kaesari SaatavaahanuDu poorvajuDu nee jaatikee
paDati seetammatO raamayya koluvaina paMchavati chaalu nee prakhyaatiki ||tala etti||

taratarammulu daaTi taralivachchina mahaatmulatapa@h saMpatti nee vaarasatvaM
ichaTa puTTina chiguru kommaina chaevayani aaMdhrulaku aMdinadi aarya satvaM
muvvanne jeMDaaga minnaMTi lOkaana maeTi saMskRti chaaTu ghanata nee svaMtaM
bhaarataaMbaku pedda koDukugaa managalugu aatma gauravamutO vardhillu nityaM ||tala etti||

No comments: