Sunday, May 2, 2010
ఆంటీ--1994
ఆంటీ--1994
తారాగణం::జయసుధ, నాజర్, ఆనంద్, రాజారవీంద్ర, చిన్నా
పల్లవి:
ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి
మనసేమిటో మమతేమిటో శృతి చేసుకున్నవి
జతలో బ్రతుకే ముడివేసుకున్నవి
కలలే కథలే కలబోసుకున్నవి
ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి
మనసేమిటో మమతేమిటో శృతి చేసుకున్నవి
చరణం::1
వెన్నెలై వెలిగి కాపురం చిలికె సుధలను జీవితం
విరిసెలే బ్రతుకు బంధము తను శ్రీమతిగా ధన్యము
వెన్నెలై వెలిగి కాపురం చిలికె సుధలను జీవితం
విరిసెలే బ్రతుకు బంధము తను శ్రీమతిగా ధన్యము
ఓ ఓ ఓ ఓ ఓ మజిలీలెన్నెన్నో
ఓ ఓ ఓ ఓ ఓ మలుపులు ఇంకెన్నో
మగని నీదు త్యాగం మరువదీ లోకము
ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి
మనసేమిటో మమతేమిటో శృతి చేసుకున్నవి
చరణం::2
పంచితే స్నేహ పరిమళం మగువ గుండెకు గాయమా
అందమే స్త్రీకి శాపమా అపనిందలకే మూలమా
పంచితే స్నేహ పరిమళం మగువ గుండెకు గాయమా
అందమే స్త్రీకి శాపమా అపనిందలకే మూలమా
ఓ ఓ ఓ ఓ ఓ కన్నీరెందులకే
ఓ ఓ ఓ ఓ ఓ కాలం ఉన్నదిలే
కలికి చిలక కలతపడక కలదు ఈ శోకము
ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి
మనసేమిటో మమతేమిటో శృతి చేసుకున్నవి
జతలో బ్రతుకే ముడివేసుకున్నవి
కలలే కథలే కలబోసుకున్నవి
ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి
మనసేమిటో మమతేమిటో శృతి చేసుకున్నవి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment