Monday, May 17, 2010

భైరవ ద్వీపం ~~ 1994




సంగీతం::మాధవపెద్ది సురేష్
డైరెక్షన్ సింగీతం:: శ్రీనివాస రావ్
గానం::KS.చిత్ర


విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మయచేసినది

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మొహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించే ఆమని పులకించే కామిని
వసంతుడే చెలికాంతుడై
దరి చేరే మెల్లగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరితేనే
జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి
మురిసేను తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగాగా
మారుడే సుకుమరుడై
జతకుడే మాయగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవి
గా

No comments: