Sunday, November 22, 2009

ఏక్ నిరంజన్ ~~2009

సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రంజిత్

అమ్మా లేదు నాన్నా లేడు ..అక్కా చెల్లి తంబీ లేరు..ఏక్ నిరంజన్ ..
పిల్లా లేదు పెళ్ళీ లేదు..పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు..ఏక్ నిరంజన్..

ఊరే లేదు..నాకూ పేరే లేదు..నీడ అలేదు..నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను..ఎక్కిళ్ళే రావసలే
నాకంటూ ఎవరూ లేరే..కన్నీళ్ళే లేవులే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే..

అమ్మా లేదు నాన్నా లేడు..అక్కా చెల్లి తంబీ లేరు..ఏక్ నిరంజన్..
పిల్లా లేదు పెళ్ళీ లేదు..పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు..ఏక్ నిరంజన్..

care of platform..son of bad time..awara.com
హే దమ్మర దం..tonnes of freedom..మనకదేగా ప్రాబ్లం
అరె date of birthaeతెలియదే..నే గాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే ..నా గోలేదో నాదే

తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే

పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే ..

అమ్మా లేదు నాన్నా లేడు..అక్కా చెల్లి తంబీ లేరు..ఏక్ నిరంజన్..
తట్టా లేదు బుట్టా లేదు ..బుట్ట కింద గుడ్డు పెట్టే పెట్టా లేదు..ఏక్ నిరంజన్ ..

dillish body full of feelings, no one is caring
thats ok yaar,chalta hai, నేనే నా darling
ఏ..కాకా చాయే..అమ్మలా నను లేరా అంతుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ

రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడానే లేదేలే

పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే ..

అమ్మా లేదు నాన్నా లేడు..అక్కా చెల్లి తంబీ లేరు..ఏక్ నిరంజన్..
కిస్సూ లేదు మిస్సూ లేదు..కస్సు బుస్సు లాడే లస్కూ లేదు..ఏక్ నిరంజన్..

No comments: