Sunday, November 22, 2009
తాజ్ మహల్ ~~2009
సంగీతం::అభిమాన్
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::మాళవిక
నువ్వంటే ఇష్ఠమనీ..నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ..నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా
ఏ చోట నేనున్నా..నీ పిలుపు వింటున్నా
ఆ..ఏ వైపు చూస్తున్నా..నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ
ఎంత సేపో ఇలాగ నీతో ఊసులాడే సరాగమేంటో
నలిగింది కాలం చాలా జాలిగా
నిన్న లేనీ వసంతమేదో వంత పాడే స్వరాల వలలో
వెలిగింది మౌనం మరో మాటగా
మునుపెన్నడు తెలియని ఈ వరసేదో నీవలనేగా !
తెల్లవారే తూరుపులోనా..పొద్దువాలే పడమరలోనా
నీ స్పర్శలాంటీ ఏదో లాలనా
గాలి మేనా సవారిలోనా..తేలిపోయే ఏ రాగమైనా
నీ శ్వాసలానే సమీపెంచెనా
ప్రతినిమిషం ఆరాటం గా నీకోసం నే చూస్తున్నా !
నువ్వంటే ఇష్ఠమనీ..నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ..నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా
ఏ చోట నేనున్నా..నీ పిలుపు వింటున్నా
ఏ వైపు చూస్తున్నా..నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment