Tuesday, February 10, 2009

ధర్మక్షేత్రం~~1992


సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::బాలు,సుశీల

ఎన్నో రాత్రులొస్తాయి గానీ..రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ..లేదీ వేడిచెమ్మా
అన్నాడే..ఏ..చిన్నోడూ..అన్నిట్లో..ఉన్నోడూ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ..రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ..లేదీ వేడిచెమ్మా


ఎన్ని మోహాలు మోసీ...ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే..పెదవి కొరకే..ఓహోహో..ఓ..
నేనెన్ని కాలాలు వేచా..ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే..మరుల సుడికే..ఓహోహో..ఓ..
మంచం ఒకరితో అలిగినా..మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా..సాయం వయసునే అడిగినా

ఓ..ఓ..ఓ..ఓ ..ఓ..ఓ..ఓ..ఓ..
ఎన్నో రాత్రులొస్తాయి గానీ..రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ..లేదీ వేడిచెమ్మా


గట్టివత్తిళ్ళ కోసం..గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే..తొనల రుచికే....ఓహోహో..ఓ..
నీ గోటిగిచ్చుళ్ళ కోసం..మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా..చెలిమి జతకే....ఓహోహో..ఓ..
అంతే ఎరుగనీ అమరికా...ఎంతో మధురమీ బడలికా
ఛీ..పో బిడియమా సెలవికా...నాకీ పరువమే పరువికా
హో..ఓ ..ఓ ..ఓ..ఓ..ఓ..ఓ..
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ...అన్నిట్లో ఉన్నోడూ
ఒహో...ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా ...ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

Wednesday, February 4, 2009

ఆరు~~2005



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
గానం::టిప్పు,సుమంగళి

చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
అప్పుడు పంచిన నా మనసే..తప్పని అనవద్దె
ఇప్పుడు పెరిగిన వడ్డితో ఇమ్మని అడగొద్దే...
చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె

వద్దు వద్దంటు నేనన్న వయసె గిల్లింది నువ్వెగ
పొ..పొ..పొమ్మంటు నేనున్న,పొగలా అల్లింది నువ్వెగా..
నిదొరోతున్న హృదయాన్ని లాగింది నువ్వెగా
నలుపై ఉన్న రాతిరిలో రంగులు నువ్వెగా.....
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నీలో నిలిపావే..ఏ..
చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె

వద్దు వద్దంటు నువ్వున్న వలపే పుట్టింది నీపైన
కాదు కాదంటూ నువ్వన్నకడలేపొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్న
సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా...
మంటల తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే..ఏ..
చుడొద్దె నను చుడొద్దు..చుర కత్తిలాగ నను చుడొద్దు
వెళ్ళొద్దు వదిలి వెళ్ళొద్దు..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
అప్పుడు పంచిన నా మనసే..తప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే

Tuesday, February 3, 2009

నచ్చావులే~~2008


సంగీతం::శేఖర్ చంద్ర
రచన::భాస్కర భట్ల
గానం::రంజిత్
డైరెక్టర్::అల్లరి రవి బాబు

మన్నించవా మాటాడవా
కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా
కరునించవా కనిపించవా

I am so sorry baby oo oo oo...
i am really sorry baby oo oo oo...

ఓ చెలీ పొరపటుకీ
గుణపాటమే ఇదా ఇదా
మౌనమే ఉరితాడులా
విసిరెయ్యకే ఇలా ఇలా

మన్నించవా మాటడవా
కరుణించవా కనిపించవా
మన్నించవా మాటడవా
కరుణించవా కనిపించవా


నావల్ల జరిగింది తప్పు
నేనేమి చెయ్యలో చెప్పు
పగపట్టి పామల్లే నువ్వు బుసకొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి
కారాలు మిరియాలు నూరి
ఎవేవో సాపాలు గట్ర పెట్టేయ్యకే
కళ్ళావేళ్ళా పడ్డకూడ ఊరుకోవా
కుయ్యోమొర్రో అంటు ఉన్న అలక మానవా
అందం చందం అన్ని ఉన్న సత్యబామ
ఫంతం పట్టి వేధించకే నువ్వు ఇలా
ఓ..హో..చెలీ చిరునవ్వులే కురిపించవా ఓ.హో.ఓ.హో
రాదని విదిలించకే బెదిరించకే ఇలా ఓ.హో.ఓ.హో
మన్నించవా మాటడవా కరుణించవా కనిపించవా


అరగుండు చేయించుకుంటా బ్లేడెత్తి కోసేసుకుంటా
కోరడతో కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజిళ్ళు తీస్తా ఒంగోంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయే కొడతా దయ చూపవే
గుండెల్లోన అంతొ ఇంతొ జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించవా
Friendship అంటే అడపా దడపా గొడవే రాదా
Sorry అన్న సాధిస్తవే నీడలా
ఓ..హో చెలీ ఎడబటునే కలిగించకే ఇలా ఇలా
నన్నిలా ఏకాకిలా వదిలేళ్ళకే అలా ఆ

మన్నించవా మాటడవా కరునించవా కనిపించవా

గజని--2005





సంగీతం::హర్రీష్ జయరాజ్రచన::వెన్నెలకంటి
గానం::కార్తీక్
ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..
అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే


ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పాత పదనిస దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా..నీ..సా..
నను తాకే కొండ మల్లికా..నీ..సా
సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా


అ..అ..ఒక మారు కలిసిన అందం..హ..అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా
హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే


ల ర లాల లర లల లాల..ఓ..ల ర లాల లర లల లాల
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే

గజని--2005::Gajani--2005
















సంగీతం::హర్రీష్ జయరాజ్
రచన::వెన్నెలకంటిగానం::హరీష్ రాఘవేంద్ర,బాంబే జయశ్రీ

హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


కుందనం మెరుపు కన్నాబంధనం వయసుకున్నాచెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నాకోరికే తెలుపుకున్నాచూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా....
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా..నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా....


హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా చలికి నే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా..ఎండ చల్లనా..తాపం లోనా మంచు చల్లనా....
కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా..కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా

హృదయం ఎక్కడున్నదీ
హృదయం ఎక్కడున్నదీ
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా


Ghazini--2005
Music::Harris Jayaraj
Lyrics::Vennelakanti
Singer's::Harish Raghavendra,Bombay Jayashree

::::

Pallavi :
Hrudayam ekkadunnadii
Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii
Andamaina abadham aduthunna vayase
Naalo viraham penchuthunnadiii
chupulakai vethika chupullone bathika
Kallu therachi swapname kannaa
Tholi saarii
Kallu therachi swapname kannaa 

Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii

:::1

Kundanam merupu kannaa
Vandanam vayasukunnaa
Cheli andam nedee andukunnaaa
Gundaloo kosaruthunnaa
Korike thelupukunnaa
Chupee vesi brathikisthavanukunnaa
Kanti papalaa
Puvvulanee nee kanulaloo kannaa
Nee kalle vaadi poni puvvulammaa
Nee kalle vaadi poni puvvulammaa 

Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii

:::2

Manasuloo ninnu kannaa
Manasuthoo polchukunnaa
Thalapula pilupulu vinnaaa
Segalaloo kaluthunnaa
Chaliki nee vanukuthunnaa
Nedee leni jaade thelusukunnaaa
Manchu challanaa
Enda challanaa
Thapam lona manchu challanaa
Kanna nee kopam loo na enda challanaa
Kanna nee kopam loo na enda challanaa ♥♫♥

Hrudayam ekkadunnadii
Hrudayam ekkadunnadii
Nee chuttune thiruguthunnadiii mmm...
Andamaina abadham aduthunna vayase
Naalo viraham penchuthunnadiii
chupulakai vethika chupullone bathika
Kallu therachi swapname kannaa
Tholi saarii
Kallu therachi swapname kannaa
Tholi saarii

Kallu therachi swapname kannaa ♥♫♥

పెళ్ళైన కొత్తలో~~2006



సంగీతం::Agashtya
రచన::వెన్నెలకంటి
గానం::శ్రేయ ఘోషల్

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
కురిసింది గుండెల్లో వెన్నెల్లమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడింది
కూనలమ్మా....
ఎద లోతుల్లో
అలజడి రీగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచేను ప్రేమ నాలో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే..


కలలో ఒక రూపమే
కనులకు తెర తీసే
వెలిగించని దీపమే
తొలి జిలుగులు కురిసే
ఐనా మరి ఎందుకో
తడబడినది మనసూ
ఇది ఎమో ఎమిటో
అది ఎవరికి తెలుసూ
ఒక వింతగా...
పులకింతగా...
తొలి తలపే
మది చాటుగా
సడి చెసినది ఎందుకూ


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే


ఎదలో రసవీణలే
సరిగమలే పలికే
ఎదురయి విరివానల్లే
మధురిమలె చిలికే
మాట నే మౌనమే
కల కలములు రేపే
వెంటాడే స్నేహమే
కలవరములు చూపే
ఇది ఏమిటో
కథ ఏమిటో
తెలియని ఓ అనుమానమే
తెర తీసినది ఎందుకో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
కురిసింది గుండెల్లో
వెన్నెలమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడినది
కూనలమ్మా
ఎద లోతులో
అలజడి రేగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచెను ప్రెమ నాలో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే

ఉల్లాసంగా-ఉత్సాహంగా~~2008




సంగీతం::GV.ప్రకాష్ కుమార్
రచన::అనంత శ్రీరాం
గానం::సోను నిగం

నాననానన నాననాననా నాననాననా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే
ఇలా వచి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియతమా..అ..తిరుగులేని సౌంధర్యమా
ప్రియతమా..అ.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా..అ.. విరగబూసే వసంతమా
ప్రియతమా..అ..ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్ళని
ఎంత సేపిలా ఎంత చూసినా నిన్ను వీడి నే వెళ్ళనే


సఖీ చెలీ సఖీ చెలీ సుధామాధురీ..
నిజానికి నువ్వే మరి సదా నా సిరీ..
గులాబీలో శ్వాసే చేరగా చలాకిగా..అ నీల మారదా

O..baby you are my life i can feel you every time
Oo baby you are my life i can feel you every time

హో చేమంతికైన పూబంతికైన లేదు ఇంత సున్నితం
నాకొసం నేలపైకి నువ్వు వచ్చవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...
ఇలా వచ్చి అలా నవ్వి వలెస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఏదో తెలీలేదే ఎలా ఎలా


ప్రియ అని ప్రియ అని పిలుస్తావనీ
నరాలలో ప్రతి కణం నిరీక్షించినీ
సరాగమా..అ నీపై ధ్యసతో
ప్రతీ క్షణం ఉన్న అశ తో

O..baby you are my life i can say u every time
O..baby you are my life i can say u every time
హో నీ చెతిలోనే ఉన్నయి నేడు న చెతి గీతలే..
నాకోసం నేలపైకి నువ్వు వచవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...


ప్రియతమా..అ..తిరుగులేని సౌంధర్యమా
ప్రియతమా..అ.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా..అ.. విరగబూసే వసంతమా
ప్రియతమా..అ..ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేలపైకి నువ్వు వచవా..అ
ఆకాశం అంచుదాక తీసుకెల్తవా..అ...