Tuesday, April 17, 2018

రంగస్తలం--2018



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్ 
రచన::చంద్రబోస్
గానం::చంద్రబోస్ 
Film Directed By::Sukumaar 
తారాగణం::తారాగణం::రాంచరణ్,సమంత, 

పల్లవి::

ఓరయ్యో..నా అయ్యా
ఈ సేతితోనే పాలు..పట్టాను 
ఈ సేతితోనే బువ్వ..పెట్టాను
ఈ సేతితోనే తలకు..పోసాను 
ఈ సేతితోనే కాళ్ళు..పిసికాను 
ఈ సేతితోనే పాడే..మొయ్యాల 
ఈ సేతితోనే కొరివి..పెట్టాలా

ఈ సేతితోనే పాలు..పట్టాను
ఈ సేతితోనే బువ్వ..పెట్టాను
ఈ సేతితోనే తలకు..పోసాను 
ఈ సేతితోనే కాళ్ళు..పిసికాను 
ఈ సేతితోనే పాడే..మొయ్యాల 
ఈ సేతితోనే కొరివి..పెట్టాలా

మాకు దారి సూపిన కాళ్ళు కట్టెలపాలాయెనా 
మాబుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా 
మాకలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా 
మమ్ము మేలుకొలిపిన గొంతు గాడనిదురపోయేనా 
మాబాదలనోదార్చ తోడుండేవాడివిరా 
ఈబాదను ఓదార్చ నువ్వుంటెబాగుండురా

ఓరయ్యో..నా అయ్యా
ఓరయ్యో..నా అయ్యా

ఈ సేతితోనే..దిష్టి తీసాను 
ఈ సేతితోనే..యెన్ను నిమిరాను 
ఈ సేతితోనే..నడక నేర్పాను 
ఈ సేతితోనే..బడికిపంపాను 
ఈ సేతితోనే..కాటికి పంపాలా 
ఈ సేతితోనే..మంటల కలపాలా

ఓరయ్యో..నా అయ్యా
ఓరయ్యో..నా అయ్యా

తమ్ముడు నీకోసం..తల్లడిల్లాడయ్య
సెల్లి గుండే నీకై..సేరువై పోయిందయ్యా 
కంచంలో నీ మెతుకు..నిన్నే ఎతికిందయ్యా
నీ కళ్ళద్దాలు నీకై..కలయ చూసేనయ్య 
నువ్వు తొడిగిన సొక్క..నీకై దిగులుపడి 
సిలక కొయ్యకి ఉరి..పెట్టుకున్దిరయ్యా 
రంగస్థలనా..
రంగస్థలనా నీ పాత్ర..ముగిసిన్దిరా 
వల్లకాట్లో శూన్యం..అంటూ మొదలయ్యేరా 
నీ నటనకు కన్నీటి..సప్పట్లు కురిసేనా 
ఎల్లోత్తను అంటూ..సెప్పె ఉంటావు రా 
నా పాపపు సేవికది..ఇనపడికుంటేరా 

No comments: