సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::రంజిత్, మమతా శర్మ
::::::::::::::::::::::::::::::::::::
హే గాజువాక సెంటరు కాడా
గాజుల కొట్టు గంగారావు
గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు
సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో
అయ్యో పాపం అయ్యో పాపం
హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా
ఆ టైలరు షాపు టైగర్ బాబు
అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా
టైలరు షాపు టైగర్ బాబు
చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే
అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం
ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి
ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం
మిర్చి హొటలు మున్నాగాడు
పౌల్ట్రి ఫారం పండుగాడు
బూటీ పార్లర్ బంటి గాడు
చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే
హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం
ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు
తీర క్లైమక్స్ అయ్యెలోనే నన్ను యక్స్-రెయ్ తీశాడు
ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి
ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు
పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు
ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో కొత్తరకాన్ని
హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని
హెయ్ జంతరు మంతరు కంత్రి రాని
ఎక్కువలన్ని తక్కువ కాని
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని
మా అమ్మతోడు నానమ్మతోడు
ఊరికి వచ్చిన మైసమ్మతోడు
ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు
అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే
హెయ్ అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం
హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు
పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే
వీపు మోత మోగుడే
హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం
No comments:
Post a Comment