Tuesday, January 25, 2011

వర్షం--2004




సంగీతం:: దేవిశ్రీ ప్రసాద్
రచన:: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ
గానం: :KS.చిత్ర , కల్పన , Raqeeb Alam


సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాన సిలిపి నవ్వులొ
పంచ వన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
సినుకు రవ్వలో సినుకు రవ్వలో సిన్నదాని సంబరాన

ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావె పైన
చుట్టంలా వస్తావె చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తకిట తకిట తా...
ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావె పైన

ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవె ముత్యపు చినుక
చెవులకు సన్న జూకాల్లాగ చేరుకోవె జిలుగుల చుక్క
చేతికి రంగుల గాజుల్లాగ
కాలికి మువ్వల పట్టిలాగ
మెడలో పచ్చల పతకంలాగ
వదలకు నిగ నిగ నిగలను తొడిగేల

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

చిన్న నాటి తాలియంలా నిన్ను నాలో దాచుకోనా
కన్నీటి సోయగంల నన్ను నీలా పొల్చుకోనా
పెదవులు పాడే కిల కిల లోనా
పదములు ఆడే కథకలి లొన
కనులను తడిపే కలతల లొన
నా అణువణువున నువు కనిపించేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

No comments: