సంగీతం::మిక్కీ J.మేయర్
రచన::సిరివెన్నెల
గానం::శ్వేతా ప్రసాద్
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా..
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
పదము నాది పరుగు నీది
రధమువైరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషంకమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
No comments:
Post a Comment