Saturday, September 12, 2009
ప్రాణం ~~~ 2003
సంగీతం::కమలాకర్
రచన::సాయ్ శ్రీ హరీష్
గానం::సోనూ నిగం
Actors::సదా,అల్లరి నరేష్
నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా
గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే
రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే
వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే
రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే
అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే
మాసిపోని బాసలన్ని బాసికాలు లే
ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే
ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment