Sunday, May 3, 2009

కింగ్~~~2008



సంగీతం::దేవీశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::సాగర్,దివ్య


చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా..నీ మనసులో సరిగమ
కలుపుకోవా నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఏరికోరి నీ ఎదపైన ..వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వానా..కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని ఇలా దరికి పిలుచుకోనా..హే
ఆడించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఆడ మనసులొ అభిలాష ..అచ్చ తెలుగులొ చదివేసా
అదుపు దాటి వరదయ్యింది ఈ చిలిపి చినుకు వరస ..హే
నన్ను నేను నీకొదిలేసా..ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ..
ఓఓ..చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఒకరికి ఒకరు ~~ 2003



రచన::చంద్రబోస్
సంగీతం::M.M.కీరవాణి
గానం::శ్రేయా ఘోషల్


నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా

నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైన నే మరవలేనని
నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

సుర్యుడితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని

ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా ఓ ప్రియతమా

స్వాగతం ~~ 2008

స్వాగతం ~~ 2008




డైరెక్టర్::దాశరథి
ప్రొడ్యుసర్::ఆదిత్య రాం
రచన::అభినయ శ్రీనివాస్
సంగీతం::R.P.పట్నాయక్
గానం::కార్తీక్,చిత్ర


మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా..క్షేమమా..మనిషే ప్రాణమా
చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా
చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా
ఎదలోతుల్లో ఆనందమా ....

మనసా..మౌనమా..మదిలో రాగమా...
మనసా....మౌనమా...

నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా
వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా

మనసా..మౌనమా..మదిలో రాగమా
మనసా...క్షేమమా..మనిషే ప్రాణమా
Few say It’s Lust..
Few say It’s Love..
For me It’s You..Only You

భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన
నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ
మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన
నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా
జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన

మనసా..మౌనమా..మదిలో రాగమా
మనసా..క్షేమమా..మనిషే ప్రాణమా

Friday, May 1, 2009

చిరుత--2008



సంగీతం::మణి శర్మ
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::దీపు ,రీటా
తారాగణం::రామ్ చరణ్,నేహా శర్మ    

:::::::::::::::::::::::::::::;

లవ్‌యూరా లవ్‌యూరా 
నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ 
కాదనుకున్నా కళ్ళారా

లవ్‌యూరా లవ్‌యూరా 
నా మనస్సంతా నువ్వేరా
నిన్నేనా ఇన్నాళ్ళూ 
కాదనుకున్నా కళ్ళారా

తెలిసే దాకా అంతేగా 
తెలిసిందంటే వింతేగా
కలిసే దాకా కలేగా 
కలిసిందంటే కధేగా
గోల గోలమ్మో గదిలో తోస్తాందే
రచ్చ చేస్తాందే...

వలపో వరమో దిగినాకే 
తెలిసిందంటా
మెరుపే చినుకై నీలాగే 
కలిసిందంటా గోల గోలమ్మో
ఖురాన్ కూస్తుందే హంగామా చేస్తాందే
ఖర ఖరా నమిలేస్తావే 
గలగల నవ్వేసావే 
కసురుతూ గుండెను ముసిరావే

రాయిలా చిటికేసావే
నొప్పులే కరిగించావే
గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే
గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందీ
గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే
గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే

లవ్‌యూరా.....
ఏయ్ కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్ననాతో ఉంది
వామ్మో నువ్వే నువ్వా

చెప్పాలంటే నేను నాలో లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావు కోనా
తెలియలే ఏం జరిగిందో నిధురలో ఏం కదిలిందో
మిల మిలనీలా ఎదురుంటే
రాజులా నువ్వు ఉన్నా వేపు గాజులా నే మారాలి

గోల గోలమ్మో దూరాల కోస్తుందే
గోల గోలమ్మో తరాలు మేస్తాందే
గోల గోలమ్మో వలేసి లాగుతాందే 
గోల గోలమ్మో అర్జంటా చేస్తాందే

యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో
నమ్మేలా లేనయ్యో మనస్సున ఉంది నువ్వయ్యో

నిన్నటి దాకా రోమియో 
ఇప్పుడు నేను ప్రేమియో తొలి కళ
నిజమవుతుందయ్యో అందుకనే 
ఈ చిరియో గోల గోలమ్మో

 Chirutha--2007
Music::Mani sharma
Lyricist::Rama jogayya Sastri
Singer's::Deepu , Reeta
Cast:: Ram Charan, Neha Sarma.

:::::::::::::::::::::::::::::;

Love you ra love you ra naa manasanta nuvve ra
Ninnega innallu kaadanukunna kallara
Love you ra love you ra naa manasanta nuvve ra
Ninnega innallu kaadanukunna kallara
Thelisedaka anthega telisindante vinthega
Kalisedaka kalega kalisindante kadhega
Valo valammo pichethi pothandey
Vola valammo galaatalesthandhe 
Vola volammo kadulu thostandhe racha chestandhe yo

Vaalapo... Varamo... Digi naake thelisindanta
Merupe... Chinukai... Nee laage kalisindanta
Vola valammo turaalu pustande
Gola golammo hangama chesthande
Kara kara namilesave gala gala navvesave
Kasuruthu gundenu kosiraave..
Gaalilo chitikesthave mabbule kariginchave
Vola volammo gichesi pothande
Vola volammo gee petti koosthande
Vola volammo gammathu chesthandhe
Vola vollamo thimethi pothande

Love u ra love u ra
Naa manasantha nuvve ga ninne
Na innalu kaadanukunna kallara

Edo kotha kannu choosthu undi ninnu
Ninna monna natho undi vammo nuvve nuvva
Cheppalante nenu naalo lene lenu
Entho kontha nuvve nannu marchavanukona
Theliyade em jarigindo niduralo em kadilindo
Nijamila neela eduruntey…
Raajula nuvu unnave raanila ne maarane
Vola volammo dooralu kosthande
Vola volammo daaralu vesthande
Vola volammo melesi laagathande
Gola golammo rachetti chesthande

Yo yo yoo abbayo emjarigindo emayo
Nammela lenayyo manasuna undi nuvvayyo
Ninnati daaka romeo ippudu nenu premiyo
Tholi kala nijamavuthundayyo andukane ee jeerio
Vola volammo

చిరుత--2008