Saturday, March 14, 2009

!! మల్లెపూవు !! 2008



సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::శ్రేయ ఘోషల్,కార్తీక్

మల్లెపువ్వులో మకరందమా
మౌనరాగమే ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

మబ్బు చాటూ ఈ జాబిలమ్మ సోకూ
వెన్నెలంతా ఓ నాకూ సోకెలే


మల్లెపువ్వులో మకరందమా
మౌనరాగమే ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా


కలలోనైనా చూడలేదులే ఇంతటి అందం ఎన్నడూ
కంట్లో ఉన్నా దొరకలేదులే ఈ కనుపాపా ఎన్నడూ
మనసింతేలే అది మాయేలే
ఈ పగలైనా ఇక రేయే
ఇది మాయేలే ఇది హాయేలే
ఇంతేలే ఇది వింతే

మొన్నలేనిదీ నిన్న కానిదీ

నేడు తోడుగానె ఉందిలే
మల్లెపువ్వులో మకరందమా
మౌనరాగమే ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా


కొమ్మచాటునున్నా కన్నె కోయిలా కమ్మగ పాడే వేళా
నల్లమబ్బు చూసీ ఏ మయూరమో హాయిగ ఆడే వేళా
శృతి నీదేలే లయ నాదేలే
ఏ పదమైనా అనురాగాలే
తొలివలపేలే అది మెరుపేలే
అంతేలేదిక ఇంతేలే
నీవు అన్నదీ నేను విన్నదీ

సుమగానమల్లె ఉందిలే

మల్లెపువ్వులో మకరందమా
మౌనరాగమే ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

మబ్బు చాటూ ఈ జాబిలమ్మ సోకూ
వెన్నెలంతా ఓ నాకూ సోకెలే

మల్లెపువ్వులో మకరందమా
మౌనరాగమే ఒక అందమా
కంటిపాప చీకటింటి దీపమా
కౌగిలింత కోరుకున్న రూపమా

No comments: