Wednesday, January 12, 2011

స్నేహితుడ -- 2009




సంగీతం::శివరామ్ శంకర్
రచన::భాషాశ్రీ
గానం::కార్తీక్,శ్రేయా ఘోషాల్


ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎందుకో ఏమిటో చెప్పలేను కానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పెవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందని

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ మన బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

హీరో ~~ 2008



సంగీతం::మణిశర్మ
రచన::అనంత్ శ్రీరాం
గానం::హరిచరణ్,ప్రయ

కన్నుల్లోన కనబడే..మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే..తలపులన్నీ వలపులే..2
వలపంటే అదే..నీ వలనే అనీ
కలిగిందే అనీ..వయసన్నదీ

వయసంతా..పెదవుల్లో
కదిలిందే ఏదో..కోరిందే
కదిలే ఈ కాలం..ఆగిందే
కన్నుల్లోన కనబడే..మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే..తలపులన్నీ వలపులే

ఊపిరిలో ఆవిరులే వేసాకాలం
వేసవిలో నీ చెలిమే శీతాకాలం
కలకాలం..కలగాలీ..కులుకుల్లో జ్వరం
కలిగే..ఆ జ్వరమే..ఉడికించే వరం
ఎన్నో వరములనే నువ్వే ఇస్తున్నా
ఇంకా ఇంకొకటీ కావాలంటున్నా

కన్నుల్లోన కనబడే..మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే..తలపులన్నీ వలపులే

ఇంకొకటీ వేరొకటీ నాదౌతుంటే
ఇప్పటికీ ఇచ్చినదీ ఇంకా కొంతే
ఇది కొంతే..అనుకుంటే..ఇక ఇస్తాను నా
ప్రాణం..అది చాలా..మరి ఈ జన్మకీ
ప్రాణం లో వెలిగే ప్రేమే కావలెనే
ప్రేమించే మదిలో చోటే కావలెనే

కన్నుల్లోన కనబడే..మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే..తలపులన్నీ వలపులే..2

Monday, January 3, 2011

ఆరెంజ్ -- 2010




సంగీతం::హరిస్ జయ్ రాజ్
రచన::వనమాలి
గానం::నరేష్ అయ్యర్

నేను నువ్వంటూ..వేరై ఉన్నా..
నాకీవేళా..నీలో నేనున్నట్టుగా..
అనిపిస్తూ ఉందే వింతగా..
నాకోసం నేనే వెతికేంతగా..

నువ్వే లేకుంటే..ఏమౌతానో..
నీ స్నేహాన్నే..కావాలంటున్నానుగా..
కాదంటే నామీదొట్టుగా..ఏమైనా చేస్తా నమ్మేట్టుగా

ఒకసారి చూసి నే వలచానా..
నను వీడిపోదు ఏ మగువైనా..
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా..
నా ప్రేమలోతులో మునిగాకా..
నువు పైకి తేలవే సులభంగా..
ప్రాణాలైనా ఇస్తా ఏకంగా..

నేను నువ్వంటూ..వేరై ఉన్నా..
నాకీవేళా..నీలో నేనున్నట్టుగా..
అనిపిస్తూ ఉందే వింతగా..
నాకోసం నేనే వెతికేంతగా..

నిజాయితీ ఉన్నోడినీ..
నిజాలనే అన్నోడినీ..
అబద్దమే రుచించనీ అబ్బాయినీ..
ఒకే ఒక మంచోడినీ..
రొమాన్సులో పిచ్చోడినీ..
పర్లేదులే వప్పేసుకో సరేననీ..
ముసుగేసుకోదు ఏ నాడూ..
నా మనసే ఓ భామా..
నను నన్నుగానే చూపిస్తూ..
కాదన్నా పోరాడేదే నా ప్రేమా..

నేను నువ్వంటూ..వేరై ఉన్నా..
నాకీవేళా..నీలో నేనున్నట్టుగా..
అనిపిస్తూ ఉందే వింతగా..
నాకోసం నేనే వెతికేంతగా..

తిలోత్తమా తిలోత్తమా..ప్రతీక్షణం విరోధమా..
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా..
ఓ ఓ గ్రహాలకే వలేసినా..దివే అలా దిగొచ్చినా..
ఇలాంటీ ఓ మగాడినే చూళ్ళేవమ్మా..
ఒకనాటి తాజ్ మహలైనా..నా ముందూ పూరిల్లే
ఇకపై గొప్ప ప్రేమికుడై..లోకంలో నిలిచే పేరే నాదేలే..

నేను నువ్వంటూ..వేరై ఉన్నా..
నాకీవేళా..నీలో నేనున్నట్టుగా..
అనిపిస్తూ ఉందే వింతగా..నాకోసం నేనే వెతికేంతగా..

నువ్వే లేకుంటే..ఏమౌతానో..
నీ స్నేహాన్నే..కావాలంటున్నానుగా..
కాదంటే నామీదొట్టుగా..ఏమైనా చేస్తా నమ్మేట్టుగా..

ఒకసారి చూసి నే వలచానా..
నను వీడిపోదు ఏ మగువైనా..
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా..
నా ప్రేమలోతులో మునిగాకా..
నువు పైకి తేలవే సులభంగా..
ప్రాణాలైనా ఇస్తా ఏకంగా..

ఆరెంజ్ -- 2010




సంగీతం::హరిస్ జయ్ రాజ్
రచన::వనమాలి
గానం::కార్తీక్


చిలిపిగ చూస్తావలా..పెనవేస్తావిలా..నిన్నే ఆపేదెలా
చివరకి నువ్వే అలా..వేస్తావే వలా..నీతో వేగేదెలా

ఓ ప్రేమా..కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే..అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా


చిలిపిగ చూస్తావలా..పెనవేస్తావిలా..నిన్నే ఆపేదెలా
చివరకి నువ్వే అలా..వేస్తావే వలా..నీతో వేగేదెలా

నిన్నే ఇలా..చేరగా..మాటే మార్చీ మాయే చెయ్యాలా
నన్నే ఇకా..నన్నుగా..ప్రేమంచనీ ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా..ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా..ఊరించేస్తూ అల్లేస్తుందే నీ సంకెలా

కొంచెం మధురము..కొంచెం విరహము..ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము..కొంచెం శాంతము..గొంతులో చాలు గరళం
కొంచెం పరువము..కొంచెం ప్రణయము..గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము..కొంచెం గానము..ఎందుకీ ఇంద్రజాలం

ఇన్నాళ్ళుగా..సాగినా..ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో..గుండెతో..స్నేహం కోరీ వెళుతున్నా
ప్రేమనే..దాహం తీర్చే..సాయం కోసం వేచానిలా
ఒక్కోక్షణం..ఆ సంతోషం..నాతో పాటు సాగేదెలా ఎలా

చిలిపిగ చూస్తావలా..పెనవేస్తావిలా..నిన్నే ఆపేదెలా
చివరకి నువ్వే అలా..వేస్తావే వలా..నీతో వేగేదెలా

ఓ ప్రేమా..కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కలా
కొన్నాళ్ళే..అందంగా ఊరిస్తోందీ ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా

కొంచెం మధురము..కొంచెం విరహము..ఇంతలో నువ్వు నరకం
కొంచెం పరువము..కొంచెం ప్రణయము..గుండెనే కోయు గాయం
కొంచెం మధురము..కొంచెం విరహము
కొంచెం పరువము..కొంచెం ప్రణయము

Saturday, October 2, 2010

అదుర్స్ -- 2009




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
ప్రోడ్యుసర్::వంశి మోహన్
డైరెక్టర్::VV.వినాయక్
గానం::కునల్ గంజవల,శ్రేయ ఘోషల్


నా కళ్ళల్లోనా చూపులు నీతోనే
నా కాళ్ళల్లోనా పరుగులు నీతోనే
నా పెదవుల్లోనా ముద్దులు నీతోనే
నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే

నా ఊహలు అన్నీ నీతోనే
నా ఊసులు అన్నీ నీతోనే
రా రేయీ పగలూ హాయీ దిగులూ అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

నా కళ్ళల్లోనా చూపులు నీతోనే
నా కాళ్ళల్లోనా పరుగులు నీతోనే

ఇష్ఠం అన్నది ఉందంటే .. కష్ఠం అన్నది ఎంతున్నా
కలిపేస్తుంది ఎపుడూ నీతోనే .. నీతోనే !
తీరం అన్నది ఉందంటే .. దూరం అన్నది ఎంతున్నా
చేరుస్తుంది నన్నే నీతోనే .. నీతోనే !!

నా కోరికలన్నీ నీతోనే
నా తీరికలన్నీ నీతోనే
నా ఆటా పాటా వేటా బాటా అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

హే అందం అన్నది ఎంతున్నా .. నువు కాదంటే అది సున్నా
అందం చందం అంతా నీతోనే .. నీతోనే!
గాయం అన్నది కాకుంటే .. ప్రాయం ఉన్నా లేనట్టే
సాయంకాలం సాయం నీతోనే .. నీతోనే !!

నా వేడుకలన్నీ నీతోనే
నా కూడికలన్నీ నీతోనే
నాతో నేనూ లేనే లేనూ అన్నీ నీతోనే !

నీతోనే .. నీతోనే .. నీతోనే .. నీతోనే !

Friday, September 10, 2010

కొత్త బంగారు లోకం -- 2008




సంగీతం::మిక్కీ J.మేయర్
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు


నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..

కొత్త బంగారు లోకం -- 2008




సంగీతం::మిక్కీ J.మేయర్
రచన::సిరివెన్నెల
గానం::నరేష్ అయ్యర్,కళ్యాణి



ఓ..కే అనేశా..దేఖో నా భరోసా
నీకే వదిలేశా..నాకెందుకులే రభసా --2

భారమంతా..నేను మోస్తా..అల్లుకోవాశాలతా
చేరదీస్తా..సేవ చేస్తా..రాణిలా చూస్తా
అందుకేగా..గుండెలోనే..పేరు రాశా

తెలివనుకో..తెగువనుకో..మగజన్మకలా
కధ మొదలనుకో..తుదివరకూ..నిలబడగలదా

ఓ..కే అనేశా..దేఖో నా భరోసా
నీకే వదిలేశా..నాకెందుకులే రభసా --2
పరిగెడదాం..పదవె చెలీ
ఎందాక అన్నానా
కనిపెడదాం..తుది మజిలీ
ఎక్కడున్నా
ఎగిరెళదాం..ఇలనొదిలీ
నిన్నాగమన్నానా
గెలవగలం..గగనాన్నీ
ఎవరాపినా

మరోసారి అను ఆ మాటా..మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం..నీకోసం..ప్రాణం సైతం పందెం వేసేస్తా

ఆ తరుణమూ..కొత్త వరమూ..చెంగుముడి వేసిందిలా
చిలిపితనమూ..చెలిమి గుణమూ..ఏవిటీ లీల
స్వప్నలోకం..ఏలుకుందాం..రాగమాలా

అదిగదిగో..మది కెదురై..కనబడలేదా
కధ మొదలనుకో..తుదివరకూ.. నిలబడగలదా

పిలిచినదా..చిలిపి కలా
వింటూనే వచ్చేశా
తరిమినదా..చెలియనిలా
పరుగు తీశా
వదిలినదా..బిడియమిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా..చిక్కు వలా
ఎటో చూశా

భలేగుందిలే నీ ధీమా..ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా..బెదరకుమా.
త్వరగా..విడిరా..సరదా..పడదామా...

పక్కనుంటే..ఫక్కుమంటూ..నవ్వినా నా ప్రియతమా
చిక్కునుంటే..బిక్కుమంటూ..లెక్క చేస్తాగా
చుక్కలన్నీ..చిన్నబోవా..చక్కనమ్మా

మమతనుకో..మగతనుకో.మతి చెడి పోదా
కధ మొదలనుకో..తుదివరకూ..నిలబడగలదా