Sunday, November 22, 2009

తాజ్ మహల్ ~~2009



సంగీతం::అభిమాన్
రచన::భాస్కరభట్ల
గానం::కార్తీక్


నీమీదే మనసు పడీ..మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ..లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే

కళ్ళే వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ..మారిందే గుండె సడీ

మునిగిందిలే మది నీ ధ్యాసలో..తేలదు కదా ఇక ఈ జన్మలో
మునిగిందిలే మది నీ ధ్యాసలో..తేలదు కదా ఇక ఈ జన్మలో
హృదయాలనే జత కలిపేందుకూ..వలపన్నదే కద ఒక వంతెనా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా X 2

నా కళ్ళే వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ..మారిందే గుండె సడీ

చిరుగాలిలా నువ్వు వస్తావనీ..తెచ్చానులే పూల గంధాలనీ
చిరుగాలిలా నువ్వు వస్తావనీ..తెచ్చానులే పూల గంధాలనీ
ప్రతిరోజు నీకై ఆలోచనా..వినిపించదా నా ఆలాపనా
ఊరికే నను వేధించకా..చిరునవ్వుతో చెలి కరుణించవా
ఊరికే నను వేధించకా..చిరునవ్వుతో చెలి కరుణించవా

నా కళ్ళే వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే..వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ..మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ..లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే

సలీం (2009)



సంగీతం::సందీప్ చౌతా
రచన::చంద్రబోస్
గానం::ప్రదీప్ సోమసుందరన్,సోనూ కక్కర్

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ..హా ఆ X 2

జల జల వరదలు నది మది పిలుపని తెలిసిందా
తెల తెల నురగలు కడలిలొ చెలిమని తెలిసిందా
నిన్నలే వీడనీ..ఎండలే నీడనీ

నక్షత్రాలే నవ్వుతాయని
పాలపుంతలే పాడుతాయని
పుడమే నాట్యం ఆడుతుందని
అడవికి ఆమని చేరుతుందని
మయూరాలు పురి విప్పుతాయని
చకోరాలు తలలెత్తుతాయని
పావురాలు పైకెగురుతాయని
చిలక పళ్ళనే కొరుకుతందని
చేప నీటిలో తుళ్ళుతుందని
మబ్బు చినుకులే చల్లుతుందని
తేనెటీగలో ముళ్ళు ఉందని
తీగ పందిరిని అల్లుకుందని
జగతే కొత్తగ జన్మనెత్తునని
ప్రకృతి మొత్తం పరవశించునని
నేడే తెలిసిందీ

"అయ్యబాబోయ్ చంటీ..ఇంత కవిత్వం ఎలా చెప్పావ్ "

"నా చిట్టి "

ప్రేమ నాలో పుడుతుందని
ప్రేమలోనే పడతానని
ప్రేమతో మతి చెడుతుందని
నేడే తెలిసిందీ రు రు రు రూ

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ..

ఎదిగిన వయసుకు వరసే కలదని తెలిసిందా
వలచిన మనసుకు వయసే వరదని తెలిసిందా
అలజడే..ఉందనీ
అలసటే..లేదనీ

అల్లరి నాలో పెరుగుతుందని
అద్దం ఎపుడూ వదల్లేనని
ఆకలి నన్నే అంటుకోదని
ఆశలకేమో అంతులేదని
వేషం భాషా మారుతుందని
వేగం నన్నే తరుముతుందని
వేళా పాళా గురుతు రాదని
వేరే పనిలో ధ్యాస లేదని
ఒకటే దీపం వెలుగుతుందని
ఒకటే దైవం వెలసి ఉందని
ఒకటే మంత్రం మ్రోగుతుందని
ఒకటే మైకం కలుగుతుందని
ఒకటీ ఒకటీ ఒక్కటేనని
మోక్షం అంటే ఇక్కడేనని
నేడే తెలిసిందీ

" అసలేమైంది చంటీ నీకూ "

ప్రేమ తరగతి చేరానని
ప్రేమశాస్త్రం చదివానని
ప్రేమ పట్టా పొందానని

నేడే తెలిసిందీ రు రు రు రూ..

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందా..

సలీం (2009)



సంగీతం::సందీప్ చౌతా
రచన::చంద్రబోస్
గానం::నిఖిత నిగం

ఈ వేళలో...హాయిలో...మాయలో
మాట రానీ...మత్తులో

ఈ వేళలో...హాయిలో...మాయలో
మాట రానీ...మత్తులో

I wanna talk to you
I wanna talk to you-X(2)

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you
I wanna talk to you

పెదాలలో ప్రకంపనే...తొలి సాక్ష్యం
పాదాలలో ప్రవాహమే...మలి సాక్ష్యం
చెక్కిళ్ళలో సింధూరమే...చిరు సాక్ష్యం
నా కళ్ళలో సముద్రమే...ప్రతి సాక్ష్యం

అణువణువు నేడు అనేక గొంతులై
కణుకణుము కూడ...స్వరాల తంత్రులై
ఒకే మాటనే సదా స్మరించుతున్నా
అదే మాటనే చెప్పేస్తూ ఉన్నా

I love you....
I love you....

ఏం చెయ్యనూ..ఏమనీ చెప్పనూ
What do I do with out You...

I wanna talk to you
I wanna talk to you

వెన్నెల్లలో తెప్పించనా..ఆహ్వానం
కన్నీళ్ళతో చేయించనా..అభిషేకం
కౌగిళ్ళలో దాచెయ్యనా..నీ స్నేహం
ప్రాణాలలో నింపెయ్యనా..నీ రూపం

నీ శ్వాసలోన సుమాల గాలినై
నీ కాలిలోన సుగంధ ధూళినై
ఎన్నో మాటలూ వినుపించు వీలు లేకా
ఒకే మాటతో వివరించేస్తున్నా

I love you...
I love you...

ఏం చెయ్యనూ..ఏమనీ చెప్పనూ
What do I do with out You...

I wanna talk to you
I wanna talk to you

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you
I wanna talk to you

కుర్రాడు (2009)





సంగీతం::అచ్చు
రచన::అనంత్ శ్రీరామ్
గానం::కార్తీక్


ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే

నీ చూపే నవ్విందీ..నా నవ్వే చూసిందీ
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే

ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే

సంతోషం ఉన్నా..సందేహం లోనా లోనా
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా !
అంతా మాయేనా..సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ

యవ్వనమా..జమున వనమా..ఓ జాలే లేదా జంటై రావే ప్రేమ !

ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే

అందాలనుకున్నా..నీకే ప్రతి చోటా చోటా
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా..నీకే ప్రతి పూటా పూటా
వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ

అమృతమో..అమిత హితమో హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా !

ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే

విలేజ్ లో వినాయకుడు ~~2009

విలేజ్ లో వినాయకుడు ~~2009



సంగీతం::మణికాంత్ కద్రి
రచన::వనమాలి
గానం::కార్తీక్

నీలి మేఘమా...అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా (2)
తూనీగా రెక్కలే పల్లకీగా....ఊరేగే ఊహలే ఆపడం నా తరమా

నీలి మేఘమా....అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ...ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ...విరిసే పొదలూ...నా ఎదకూ ఆమెనే చూపినవి

నీలి మేఘమా...అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ....నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి

ఈ జతలో....ఒకడై ఒదిగే....ఓ వరమే చాలదా ఎన్నటికీ

నీలి మేఘమా....అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకే రంగులు నీ వరమా

గోపి గోపిక గోదావరి 2009 ( Gopi Gopika GodAvari 2009)



సంగీతం::చక్రీ
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::చక్రీ ,కౌసల్యా


నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగలుస జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుందీ వేళ
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల