Thursday, May 15, 2008

సత్యం~~~2003



strong>గానం::చక్రి
సాహిత్యం::భాస్కర భట్ల రవి కుమార్
Movie Name::Sathyam
Singer::Chakri
Music Director::Chakri
Lyrics::Bhaskara Bhatla Ravi Kumar


ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
food లేకపోయినా bed లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికి నీకే linesaa...2

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాసేశా


రమ్ము లోనా కిక్కు లేదు హెల్లో మైనా
నీ లుక్స్ చూడబోతే మత్తులోకి దించేనా
sunlight వేళ నించి moonlight వెళ్ళే దాక
fulltime నా గుండెల్లో thoughtlanni నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమాయె
!!ఓ మగువా ... ఓ మగువా ... ఓ మగువా.. ఏ..ఓ మగువా

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కొరుతుంటే దంచుతావే కారాన్ని
crazyగా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండీ
true love చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె ... నీ మాటలు లేక మోడైపోయే
మగువా ... ఓ మగువా... ఓ మగువా...ఓ మగువా

సత్యం~~~2003


సంగీతం::చక్రి
రచన::కండి కొండ
గానం::వేణు

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే మధురమే

నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
నీకోసం నే రాసే చిరు పాటైన మధురమే
నాకోసం నువ్వు పలికే అరమాటైన మధురమే
లిపిలేని సడి లేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే
ఉంటె నువ్వుంటె ఆ శూన్యం అయినా మధురమే మధురమే
మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే మధురమే


సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచె దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి నెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చె కన్ను రాల్చె ఆ కన్నీరైన మధురమే మధురమే

మధురమె మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వై
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తె మధురమే ఆ
నన్నె తడిపేస్తె మధురమే మధురమే

Wednesday, April 30, 2008

పందెం కోడి--2006



పందెం కోడి--2006
సంగీతం::యువన్ శంకర్ రాజా
రచన::వెన్నెలకంటి
గానం::రఘు కుంచె, నాగసాహితి
నిర్మాత::విక్రం కృష్ణ
దర్శకత్వం::లింగుసామి
సంస్థ::జి.కె.ఫిలిం కార్పోరేషన్
తారాగణం::విశాల్, మీరా జాస్మిన్

పల్లవి:

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత
తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత
ఆ పరువం దోచుకుపోతా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను
పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

చరణం::1

అందమిది అందమిది వచ్చే పందెంకోడిలా
పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా
సందెపొద్దు వేళలోన సన్నజాజి పువ్వులా
అందమంత ఆరబోసి నీకు హారతివ్వనా
వచ్చే వచ్చే వలపే నా మనసులోని పులుపే
ఆశ పడ్డ తలపే నా ఎదలో మోజు తెలిపే
ఇంతకుమించి ఇంతకుమించి ఏదో ఉందిలే
కలికి కులుకు తళుకుబెళుకులొలుకుతున్నాది
ఆ చిలక బుగ్గ మొలక మొగ్గ విచ్చుకున్నాది

చరణం::2

కన్నె ఇది కన్నె ఇది కన్ను కొట్టమన్నది
వన్నె ఇది వన్నె ఇది వెన్ను తట్టమన్నది
పరికిణి కట్టుకు వచ్చెను పరువాల జాబిల్లి
పదునైన సోకుగని ఎదకేదో ఆకలి
కనులు పాడే జోల ఇది దేవలోకబాల
కలలు కనే వేళ ఇది కలువపూల మాల
ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని
కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే
ఈ అందగాడి ఆశలన్ని తెలుసుకుంటాలే

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత
తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత
ఆ పరువం దోచుకుపోతా
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను
పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే


paMdeM kODi--2006
Music::yuvan^ SaMkar^ raajaa
Lyricist::vennelakaMTi
Singer::raghu kuMche, naagasaahiti
nirmaata::vikraM kRshNa
darSakatvaM::liMgusaami
saMstha: ji.ke.philiM kaarpOraeshan^
taaraagaNaM::viSaal^, meeraa jaasmin^

pallavi::

ONi vaesina deepaavaLi vachchenu naa iMTiki
choopulatO kaipulanae techchenu naa kaMTiki
aaTae daaguDumoota
tana paaTae kOyila koota
manasae mallela poota
aa paruvaM dOchukupOtaa
raeyi aedO pagalu aedO teliyalaedulae
ee haayilOna manasu naeDu karigipOyelae
muchchaTa muchchaTa muddoomuchchaTa aaDukOvaali
achchikabuchchikalaaDukuMTu kalusukOvaali
vechchaga vechchaga vayasu vichchenu
puchchukupOraa kammagaa
raeyi aedO pagalu aedO teliyalaedulae
ee haayilOna manasu naeDu karigipOyelae

charaNaM::1

aMdamidi aMdamidi vachchae paMdeMkODilaa
poMginadi poMginadi pachchi paala eeDulaa
saMdepoddu vaeLalOna sannajaaji puvvulaa
aMdamaMta aarabOsi neeku haarativvanaa
vachchae vachchae valapae naa manasulOni pulupae
aaSa paDDa talapae naa edalO mOju telipae
iMtakumiMchi iMtakumiMchi aedO uMdilae
kaliki kuluku taLukubeLukulolukutunnaadi
aa chilaka bugga molaka mogga vichchukunnaadi

charaNaM::2

kanne idi kanne idi kannu koTTamannadi
vanne idi vanne idi vennu taTTamannadi
parikiNi kaTTuku vachchenu paruvaala jaabilli
padunaina sOkugani edakaedO aakali
kanulu paaDae jOla idi daevalOkabaala
kalalu kanae vaeLa idi kaluvapoola maala
aeTavaalu choopulaesi laagiMdi naa guMDeni
kaMdi chaenu chaaTukostae kalusukuMTaalae
ee aMdagaaDi aaSalanni telusukuMTaalae

ONi vaesina deepaavaLi vachchenu naa iMTiki
choopulatO kaipulanae techchenu naa kaMTiki
aaTae daaguDumoota
tana paaTae kOyila koota
manasae mallela poota
aa paruvaM dOchukupOtaa
muchchaTa muchchaTa muddoomuchchaTa aaDukOvaali
achchikabuchchikalaaDukuMTu kalusukOvaali
vechchaga vechchaga vayasu vichchenu
puchchukupOraa kammagaa
raeyi aedO pagalu aedO teliyalaedulae
ee haayilOna manasu naeDu karigipOyelae
raeyi aedO pagalu aedO teliyalaedulae
ee haayilOna manasu naeDu karigipOyelae

Tuesday, April 15, 2008

అర్జున్~~2004


సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::కోరస్,స్వర్ణలత,ఉదిత్ నారాయణ

రారా ...రా..రా... ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రా..రా..
రా....రా ....రారా రాజకుమారా మయబజారా
ఈ భజా భలేరా రారా
నీ ఉట్టి నేనే కోట్టి నీ చడ్డీ నేనే పట్టి నీముంతా
బారువెన్నా అంతా గల్లంతేగా
నీ బెల్లంగోరు వాసి నా ఉప్పొం గుట్టులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా
ఏ..రారా ...రారా
రా ...రా ...రారా రాజకుమారా మయబజారా
ఈ భజా భలేరా.. రా..రా..

ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా
మాంతా మన్మధగీత తెల్లోరాకా
ఓ కుర్రోడా బందరు లడ్డా బండరు గుడ్డా పిల్లోడా
చిక్కిన నా గుర్రపునాడా లూదేనా గోడ
నీ గుట్టే చెన్నర్ పట్టు నీ పట్టే గొంగళ్‌ పట్టు
ఆమ్‌ పట్టు తేనెపట్టు నీ గుట్టు
వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు
దమ్ముంటే కోల్లగొట్టు దణ్ణంపెట్టు
నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా
ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పట్టా
మె నీ బెల్లంగోరు వాసి నా ఉప్పాం గుట్టులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా

రారా ...రా..రా... ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రా..రా..
రా....రా ....రారా రాజకుమారా మయబజారా
ఈ భజా భలేరా రారారా

ఓరకసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తరా కాశి వారాణాశి
ఓ రబ్బాయి పీచు మీఠాయి భామను చెయ్యి
చురుకోయి సోవోయి చాలుబడాయి దౌడూతియ్యి
ఎంతైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై
ఆరేండు నీలో ఉన్నాయి నువ్వే చెన్నై
ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ
మధురైలో మల్లెలవాన లేనా లేనా
అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి
గిల్లేస్తా నీలో చోరి హొరాహొరి
నీ బెల్లంగోరు వాసి నా ఉప్పాం గుట్టులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా

రారా ...రా..రా... ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రా..రా..
రా....రా ....రారా రాజకుమారా మయబజారా
ఈ భజా భలేరా రారా

Saturday, March 15, 2008

అర్జున్~~2004



సంగీతం::మణిశర్మ
సాహిత్యం::వేటూరి సుందరరామమూర్తి
గానం::ఉన్నికృష్ణన్,హరిణి

మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజి మల్లెల ఘుమఘుమల జావళీ
లేతసిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షీ, ఇది నీ మీనాక్షి

వరములు చిలక
స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక
శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

అఙ్గారం వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తకి కూచిపూడిలో తకధిమిత
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు గద
మనసే మథురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకిది సాక్షి

అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి వేచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు వొకటైన జంటకిది సాక్షి

Saturday, February 2, 2008

బాస్ ~~ BOSS ~~2006



సంగీతం::కల్యాణ మల్లిక్
రచన::చంద్రబోస్
గానం::Kay Kay,Sunitha

అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో

మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున

ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా
కొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందువలన

తెలిసిన కధలో కలసిన తిధిలో
తిరగని మలపులు తిరిగిన క్షణమున

ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందువలన

కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనా
కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా
నీలినింగినొదిలి తారలిటు కదిలి చేరుకున్నవి మజిలి
నీ చెలిమి పెన్నిధి తగిలి జిలిబిలి తార
ఎద గగనమున జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున

ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన

నచ్చిన చేతికి గోరింటాకవనా
నల్లని రేయికి వెన్నెల పడకవనా
కొద్దిగ ఇటు జరిగి ముద్దులో మునిగి
నవ్వవా అటు తిరిగి నేనివ్వలేనిది అడిగి

అడుగు కలిపి నడుమును కొలిచి
నడవని దారిన నదచిన క్షణమున

ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన

అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో

మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున

ధీంతార ధిరనా తక ధినక్తార ధిరనా

Sunday, January 13, 2008

ఇష్ గప్ చుప్ -- 1993

సంగీతం::రాజ్ - కోటి
గానం:;బాలు,చిత్ర

స నిసగరిసని..గమద సనిదప
పపమ పపమ పపమ పమగమ
స నిసగరిసని..గమద సనిదప
పపమ పపమ పపమ పమగమ

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై

సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సగమప దపమగ దపదప దపమగ
సగమప దనిసరి మగరిస నిదపమ

తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం నవ పద్మావతీ పాదం
రాగానికే అందం రసగీత గోవిందం
వంశధార ఒడిలో హర్ష వల్లికా
సూర్యకాంత విరిలో రాగదీపిక

సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సామ గమగమ సమాగ రిసనిద
సాససనిరీ రీరి రిసగా
సామ గమగమ సమాగ రిసనిద
సాససనిరీ రీరి రిసగా

క్షేత్రయలో జాణతనం
వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం
అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మల గంధాలివి
క్రిష్ణవేణి జడలో శైవ మల్లికా
శివుడి ఆలయాన భ్రమర దీపిక
సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా