Tuesday, April 3, 2007

నిర్ణయం~~1992



సంగీతం::ఇళయ రాజ
రచన::గణేష్ పత్రో
గానం::SP.బాలు

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటె పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా
నేనంటె కాదన్న లేదీసే లేరమ్మ
నా కంటె ప్రేమించె మొనగాడు ఎవడమ్మా
I love you darling because you are charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె,why not

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని య..య్యా
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతె పాడిస్తా లవ్ సొంగ్స్ డూఎట్లు
నా చేత్తొ తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్చ్హ మైనే ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా
అమీ తుమీ తేలకుంటె నిన్ను లేవదీస్కుపోతా are you ready

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని..ఉ..హా..హా
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

Monday, April 2, 2007

క్రిమినల్~~రాగం::ఆభేరి!11995


సంగీతం::MM.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::బాలు,చిత్ర
రాగం:::ఆభేరి(భీంపలాశ్రీ)


తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం..... నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో.... .అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో
Darling...
Every breath you take
Every move you make
I will be there with you

What would I do with out you
I want to love you
forever and ever and ever

ఎన్నడూ.... .తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో..... తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
ఆ...హా...ఆ...హా...ఆ...హా...

Saturday, March 24, 2007

ఆంధ్రుడు~~2005


సంగీతం::కల్యాణ్ మల్లిక్
రచన::చంద్రబోస్
గానం::Kay Kay

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా

స్వార్ధంలేని త్యాగాలనే చెసేది ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేది ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నడిపిందీ ప్రేమా

ఆంధ్రుడు~~2005



డైరెక్టర్::పరుచూరి మురళి
ప్రొడ్యుసర్::ML.కుమార్ చౌదరి
సంగీతం::కల్యాణ్ మల్లిక్
రచన::చంద్రబోస్
గానం::శ్రేయాఘోషల్


కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
అశా లత ల లోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా
శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా
ఖరీదు కాదు లేమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా..ఆ
మా ఊరిలొ కచేరిలో పడాలి గా హా ఆ...
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా
అదంతా తేలికెమి కాదులెమ్మా
ఎత్తాలి కొత్త జన్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

Tuesday, January 9, 2007

బాయ్స్~~2003


సంగీతం::AR.రెహమెన్
రచన::::AM.రత్నం,శివ గణేష్
గానం::సాధనా సర్గం,ఉడిత్ నారాయణ


బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ఓ..యి..ఓయి...ఓ...

ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

ప్రేమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను
చిల్లుల డబ్బీలో ప్రేమ దూరితే పిల్లన గ్రోవౌను
చెట్టు చెక్కిన పొట్టు తోటి పూల పానుపు చేద్దాం
మెడ విరిగిన బాటిల్లో దీపములై వుందాం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా

పుట్ట గోడుగుని పట్టే నాచై హత్తుకొని ఉందాం
సాలె గూటిలో సాలిడులమై ఊయలలూగేద్దాం
వాన నీటి బురదలలో వానపాముల మౌదాం
కుళ్ళిపోయినా మామిడిలో జత పురుగుల మౌదాం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ఓ..యి..ఓ..యి..ఓ...
ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

బాయ్స్~~2003



సంగీతం::AR.రెహమాన్
రచన::AM.రత్నం,శివగణేష్
దైరెక్టర్::శంకర్
ప్రొడ్యుసర్::AM.రత్నం
గానం::Clinton,Lucky Ali,Plassi

..E..hE say saa saa say rii rii say ga ga
say mE say what?
maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy
maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy
Thats what we say
ohO hO hO hO
saariigamE paadanisE maarchi vEsEy
Thats what we say

బాయ్స్~~2003



సంగీతం::AR.రెహమాన్
రచన::AM.రత్నం,శివగణేష్
గానం::చిత్ర శివరామన్,కార్తీక్ రాజ
దైరెక్టర్::శంకర్
ప్రొడ్యుసర్::AM.రత్నం