Saturday, March 24, 2007

ఆంధ్రుడు~~2005


సంగీతం::కల్యాణ్ మల్లిక్
రచన::చంద్రబోస్
గానం::Kay Kay

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా

స్వార్ధంలేని త్యాగాలనే చెసేది ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేది ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నడిపిందీ ప్రేమా

ఆంధ్రుడు~~2005



డైరెక్టర్::పరుచూరి మురళి
ప్రొడ్యుసర్::ML.కుమార్ చౌదరి
సంగీతం::కల్యాణ్ మల్లిక్
రచన::చంద్రబోస్
గానం::శ్రేయాఘోషల్


కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
అశా లత ల లోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా
శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా
ఖరీదు కాదు లేమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా..ఆ
మా ఊరిలొ కచేరిలో పడాలి గా హా ఆ...
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా
అదంతా తేలికెమి కాదులెమ్మా
ఎత్తాలి కొత్త జన్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

Tuesday, January 9, 2007

బాయ్స్~~2003


సంగీతం::AR.రెహమెన్
రచన::::AM.రత్నం,శివ గణేష్
గానం::సాధనా సర్గం,ఉడిత్ నారాయణ


బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ఓ..యి..ఓయి...ఓ...

ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

ప్రేమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను
చిల్లుల డబ్బీలో ప్రేమ దూరితే పిల్లన గ్రోవౌను
చెట్టు చెక్కిన పొట్టు తోటి పూల పానుపు చేద్దాం
మెడ విరిగిన బాటిల్లో దీపములై వుందాం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా

పుట్ట గోడుగుని పట్టే నాచై హత్తుకొని ఉందాం
సాలె గూటిలో సాలిడులమై ఊయలలూగేద్దాం
వాన నీటి బురదలలో వానపాముల మౌదాం
కుళ్ళిపోయినా మామిడిలో జత పురుగుల మౌదాం
ప్రేమ ఇదితే అదితే అని అడుగునా
ప్రేమ స్థితిని గతిని అనీ చూచునా
ఓ..యి..ఓ..యి..ఓ...
ముళ్ళమీద కాకిపిల్ల నిదురించదా
చెత్తకుప్పమీద రోజా వికసించదా
పూరిల్లైనా పర్వాలేదు ప్రేముంటే చాలు
పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం యేహ్
బూం బూం షిక్కుకా షిక్కుకా కా బూం బూం

బాయ్స్~~2003



సంగీతం::AR.రెహమాన్
రచన::AM.రత్నం,శివగణేష్
దైరెక్టర్::శంకర్
ప్రొడ్యుసర్::AM.రత్నం
గానం::Clinton,Lucky Ali,Plassi

..E..hE say saa saa say rii rii say ga ga
say mE say what?
maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy
maarchi vEsEy maarchi vEsEy maarchi vEsEy
Thats what we say
ohO hO hO hO
saariigamE paadanisE maarchi vEsEy
Thats what we say

బాయ్స్~~2003



సంగీతం::AR.రెహమాన్
రచన::AM.రత్నం,శివగణేష్
గానం::చిత్ర శివరామన్,కార్తీక్ రాజ
దైరెక్టర్::శంకర్
ప్రొడ్యుసర్::AM.రత్నం

Saturday, August 19, 2006

నువ్వు నేను ప్రేమ~~2006



సంగీతం::AR.రెహమాన్
రచన::వెన్నెలకంటి,వేటూరి
డైరెక్టర్::క్రిష్ణ
గానం::శ్రేయాఘోషల్,నరేష్ అయ్యర్

ప్రేమించే ప్రేమవ...
ఊరించె ఊహవ...
ప్రేమించే ప్రేమవ...
పూవల్లె పుష్పించీఎ...
నే..నేనా అడిగా నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదే...
ప్రేమించే ప్రేమవ

రంగో రంగోలి అని గొరింకె గుప్పెటే
రంగే పెట్టిన మెఘం విరిసి గాజుల సవ్వది ఘల్ ఘల్...
రంగో రంగొలీని గొరింకే గుప్పెటే,
రంగే పెట్టిన మేఘం విరిసి సుందరి
వన్నెలు చల్లగ మద్యాన చల్లని పున్నమి వెన్నెలై విరిసే...
ప్రేమించే ప్రేమవ

ఆ..ఆ...ఆ...ఊఊఊ......
పువై నా పూస్తున్నా నీ
పరువంగనె పుడుతా..
మదుమాసపు మాలల
మంటలు రగిలించెఉసురె..
నీవే న మది లొ వాడ,
నెనె నీ మొటమై రాగ...
నా నాడులొ నీ రక్తం,
నడక లొ నీ షబ్ధం ఉందె హొ...
తోడే దొరకని నాడు,
విల విల లాడె ఒంటరినై నెన్ హ్మ్మ్...
ప్రేమించే ప్రేమవ
నే నేనా అడిగా నన్ను నేనే...(2)
ప్రెమించే నా ప్రేమవ... ఊరించే ఊహవ...

వెలవెల వాడుక నడిగి
నెలవంకల గుడి కడదామ..
న పొదరింటికి వెరె అథిదులు రా తరమా...
తుమ్మెద చేరిన వెలె...
నీ మదిలొ చోటిస్తావా...
నెన్ ఒదిగె యెదపై ఎవరో
నిదురించ ర తరమా...
నీరే సంద్రం చెరే,
గలగల పారే మది తెలుసా...
ప్రేమించే ప్రేమవ

నే..నేనా అడిగ నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదె...
ప్రెమించే ప్రేమవ...
ఊరించే ఊహవా...
ప్రెమించే నా ప్రేమవ,
పూవల్లె పూవల్లె...రము

Thursday, July 20, 2006

గులాబి--1995:::Gulabi--1995



సంగీతం::శశి ప్రీతం
రచన::సిరివెన్నెల
గానం::సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావో

!!ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను!!

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేన



Gulabi--1995
Lyrics : Sirivennela Sitarama Sastry
Music: Sashi Preetham
Singer's: Sunitha


Ee velalo neevu em cheestu untaavo..
anukuntu untaanu..prati nimishamu nenu..
na gunde yeenaado chejaaripoindi..
nee needagaa maari naa vaipu raanandi..
duuraana untane..em maaya chesavo..

Ee velalo neevu em cheestu untaavo..
anukuntu untaanu..prati nimishamu nenu..

Nadi reyi lo neevu niduraina raaneevu..
gadipedelaa kaalamu..gadipedela kalamu..
pagalaina kaasepu pani chesukoneevu..
ne meedane dyanamu..ne meedane dyanamu..
ye vaipu chuustunna,nee rupe tochindi..
nuvu kaaka veremi kanipinchanantondi..
ee indrajaalaanni neevena chesindi..

ne perulo edo priyamaina kaipundi..
ne maata vintune,yemm tochaneekundi..
nee meeda aasedo nan nilavaneekundi..
mati poyi nenunte..nuvu navvukuntaavu..