Thursday, March 23, 2006

సింధూరం~~1997

హైరే హై జాంపండురోయ్

సంగీతం::శ్రీనివాస్ చక్రవర్తి
రచన::?
గానం::శ్రీనివాస్ చక్రవర్తి

హైరే హై జాంపండురోయ్
హైరే హై జాంపండురోయ్
కళ్ళముందు కదులుతుందిరోయ్
ముద్దుగ..ఏరూపురా..ఏంరంగురా
ఏరూపురా..ఏంరంగురా
సొంతమైతె అంతకన్ననా
అయ్యబాబోయ్

హైరే హై జాంపండురోయ్
హైరే హై జాంపండురోయ్
చూడగానే నోరూరెరోయ్
తియ్యగ..ఏరూపురా..ఏంరంగురా
ఏరూపురా..ఏంరంగురా
సొంతమైతె అంతకన్ననా
అయ్యబాబోయ్

అందమైన కోనసీమ కొబ్బెరాకులా
తెల్లవారు వెలుగులోన తులసిమొక్కలా
పెరటిలోన పెంచుకొన్న ముద్దబంతిలా
పెరుగులోన నంజుకొన్న ఆవకాయలా
బుట్టబొమ్మలా..పాలపిట్టలా..
గట్టుగాటు గోదారిలా..
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
హోయ్ తేనె చుక్కలా
వానచినుకులా..
మామ్మగారి ముక్కుపుడుకలాగుందిపిల్ల

హైరే హై జాంపండురోయ్
హైరే హై జాంపండురోయ్

పాత తెలుగు సినిమాలో సావిత్రిలా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా
తామరాకువంటిపైన నీటిబొట్టులా
వాకిలంత నిండివున్న రంగుముగ్గులా
చేపపిల్లలా చందమామలా
ముద్దుముద్దు మల్లెమొగ్గలా
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
యేహోయ్..చెరుకుపంటలా
భోగిమంటలా పసుపురంగు ఇంటిగడపలా
వుందిపిల్ల

హైరే హై జాంపండురోయ్
హైరే హై జాంపండురోయ్
కళ్ళముందు కదులుతుందిరా
ముద్దుగ ఏరూపురా ఏ రంగురా
ఏ రూపురా ఏ రంగురా
సొంతమైతె అంతకన్ననా..అయ్యబాబు
హైరే హై జాంపండురోయ్
హైరే హై జాంపండురోయ్
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే
యెయియె యెయియె యెయ్యియెయె
యెయ్య యెయియె యే

Saturday, March 4, 2006

మాత్రుదేవోభవ~~1993 !! రాగం:::శుభపంతువరాళి:::


రచన::వేటురి సుందరరావుమూర్తి
సంగీతం::M.M.కీరవాణి
గానం::చిత్ర

రాగం:::శుభపంతువరాళి:::

వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం … వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ ...మాతృదేవోభవ
పితృదేవోభవ ...పితృదేవోభవ
ఆచార్యదేవోభవ … ఆచార్యదేవోభవ


ఏడుకొండలకైన బండతానొక్కటే ....ఏడు జన్మలతీపి ఈ బంధమే
ఏడుకొండలకైన బండతానొక్కటే ....ఏడు జన్మలతీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగునీ కనక నేను నేననుకుంటె ఎద చీకటీ
హరీ …… హరీ …… హరీ …ఈఈఈఈఈఈఈఈ
రాయినై ఉన్నాను ఈనాటికీ ....రామపాదము రాక ఏనాటికీ …

వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి


నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టిప్రాణాలు

హరీ …… హరీ ……అల్లాహు అక్బరల్లాహు అక్బర్ …హరీ ……
తేజస్వినావధీనమస్తుమావిద్విషామహై ఓం శాంతి శాంతి శాంతిః
రెప్పనై ఉన్నాను మీ కంటికీ … పాపనై వస్తాను మీ ఇంటికీ

వేణువై వచ్చాను భువనానికి …
గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికీ
………

Monday, January 2, 2006

నిన్నే పెళ్ళాడుతా~~1996



సంగీతం::సందీప్ చౌట
రచన::సిరివెన్నెల
గానం::రాజేష్


ఎటో వెళ్ళిపోయింది మనసు…
ఎటో వెళ్ళిపోయింది మనసు…
ఇలా వంటరయ్యింది వయస్సు…
ఓ చల్లగాలీ…ఆచూకి తీసి…
కబురియ్యలేవా…ఏమయ్యిందో…
ఎటో వెళ్ళిపోయింది మనసు…
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు…
ఓ చల్లగాలీ…ఆచూకి తీసి…కబురియ్యలేవా…
ఏమయ్యిందో…ఏమయ్యిందో…ఏమయ్యిందో…

ఏ స్నేహమో… కావాలనీ… ఇన్నాళ్ళుగా తెలియలేదు…
ఇచ్చేందుకే…మనసుందని…నాకెవ్వరు చెప్పలేదు…
చెలిమి చిరునామా…తెలుసుకోగానే…రెక్కలొచ్చాయో…ఏమిటో…
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా వంటరయ్యింది వయస్సు…
ఓ చల్లగాలీ…ఆచూకి తీసి…కబురియ్యలేవా…
ఏమయ్యిందో…ఏమయ్యిందో…ఏమయ్యిందో…

కలలన్నవే…కొలువుండని…కనులుండి ఏం లాభమంది…
ఏ కదలికా…కనిపించని…శిలలాంటి బ్రతుకెందుకంది…
తోడు ఒకరుంటే…జీవితం ఎంతో…వేడుకవుతుంది…అంటూ…
ఎటో వెళ్ళిపోయింది మనసు…ఇలా వంటరయ్యింది వయస్సు…
ఓ చల్లగాలీ…ఆచూకి తీసి…కబురియ్యలేవా…
ఏమయ్యిందో…ఏమయ్యిందో…ఏమయ్యిందో…

హా హా హా హ హ హ మనసు
ఇలా వంటరయ్యింది వయస్సు…
ఓ చల్లగాలీ…ఆచూకి తీసి…కబురియ్యలేవా…
ఏమయ్యిందో…ఏమయ్యిందో…ఏమయ్యిందో

Sunday, January 1, 2006

టిక్ టిక్ టిక్~~1981~~ !! రాగం:::ఖమస్

సంగీతం::ఇళయ రాజ
రచన::ఆచార్య,ఆత్రేయ

గానం::S.P.బాలు,s.జానకి
రాగం::: ఖమస్ ::::

ఓ..నటనమయూరి వయ్యారీ
ఓ..నటనమయూరి వయ్యారీ
నడయాడే నీపాదం శ్రీపాదం
నడయాడే నీపాదం శ్రీపాదం
నడకలా కులుకులే నీ నాట్యం
స గ రి గ మ ప ద ని సా
ఓ...సిరి సిరి మువ్వల చిన్నారీ
i love you i love you i love you
i love you i love you i love you
అభినయం అనునయం నీ అందం
స గ రి గ మ ప ద ని సా

నీ చిలిపి కోపం నా వలపు దీపం
నీ నటన వేగం నా నయన రాగం
అదో ముద్దు అదో మత్తు నీకు
అదే నవ్వు అదే నవ్వు నాకు
ఇదే అగ్ని ఇదే జ్వాల నాకు
ఇదే లీల ఇదే హేల నీకు
వెలయితిని నేను నిదురక
బలయితిని నీదు సొగసుకు
ఈ గడుపకు తోరణముగ నేనుండిన చాలంటిని
స ని ద ప మ ప ద నీ
నా...అడుగుల మడుగుల చెలికాడా

నీ పెదవిపైనా నా ప్రేమ రచన
నీ మనసులోనా నా మమతవాన
ఒకే కోవెలోకే దేవి నాకు
ఒకే పూవు ఒకే పూజ నీకు
ఒకే జపము ఒకే తపము నీకు
ఒకే వరము ఒకే యుగము నాకు
తపించితి నిన్ను పొందక
తరించితి నీకు అందక
నా హౄదయము నా జన్మము
నీ పరమని నీ వశమని
సా ని ద ప మ ప ద నీ

ఓ..నటనమయూరి వయ్యారీ
i love you i love you i love you
i love you i love you i love you
నడకల కులుకులే నీ నాట్యం
స రి గ మ ప ద ని సా
ఓ.. నటనమయూరి వయ్యారీ

Tuesday, January 1, 2002

మురారి--2001




సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల
గానం::చిత్ర

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్..అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా..అంటోంది ఓ మోమాటం..
నువ్వంటే మరి..అదేదో ఇది..అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి..లా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్..అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా..అంటోంది ఓ మోమాటం..

వెంట తరుముతున్నావేంటీ ఎంత తప్పుకున్నా..
కంటికెదురు పడతావేంటీ ఎటు చూసినా..
చెంప గిల్లిపోతావేంటీ గాలి వేలితోనా..
అంత గొడవపెడతావేంటీ నిద్దరోతు ఉన్నా..
అసలు నీకు ఆ చొరవేంటీ తెలియకడుగుతున్నా..
ఒంటిగా ఉండనీవేంటీ ఒక్క నిముషమైనా..
ఇదేం అల్లరి.. భరించేదెలా..అంటూ నిన్నెలా కసరనూ!
నువ్వేం చేసినా..బావుంటుందని..నిజం నీకెలా చెప్పనూ!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్..అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా..అంటోంది ఓ మోమాటం..

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా..
ఏడిపించబుద్ధవుతుంది ఎట్టాగైనా..
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా..
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా..
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా..
లేని పోని ఉక్రోషం తో ఉడుకెత్తనా..
ఇదేం చూడకా..మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా..
అదేంటో మరీ..ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా..అయ్యో రామా!

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్..అంటోంది ఓ ఆరాటం..
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా..అంటోంది ఓ మోమాటం..
నువ్వంటే మరి..అదేదో ఇది..అనేద్దామనే ఉన్నదీ..
ఫలానా అని తెలీదే మరి..ఎలా నీకు చెప్పాలనీ..
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా..ఐ లవ్ యు చెప్పేసేయ్..అంటోంది ఓ ఆరాటం..
ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..ఐ లవ్ యూ..

Friday, July 17, 1998

జీన్స్ -- 1998

జీన్స్ 1998
సంగీతం::A.R.రెహమాన్
రచన::A.M.రత్నం,శివగణేశ్
గానం::ఉన్నికృష్ణన్,పల్లవి

సాకీ :
నాకే..నాకా..నాకే..నాకా..
నువు నాకే నాకా..ఆ..ఊఁ..నాకా
మధుమిత మధుమిత మధుమిత..

హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్‌లొచ్చిన స్ర్తీ కవిత నాకే నాకా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్‌కూ సమాధినే ధర చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో
పైర గాలికి వయసాయే నేల తల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు

హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా

చెర్రి పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్‌యూ
సైఫస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్‌యూ
నీ ప్రేమనే నువు తెలుపగ
గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో
ఒంటె కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పూమాలవో పూవెట్టనా
చిందే చినుకులు నేల వాలెను నీ బుగ్గలే ముద్దాడ గా నేను నిన్నూ ముద్దాడనా
హృదయ స్పందన నిలిచె నువు ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్విడిస్తే మరుక్షణం ఉండదు నాప్రాణం

హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందనవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..
హార్ట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్‌లొచ్చిన స్ర్తీ కవిత నీకే నీకు
నిన్ను నేను కప్పుకొనేనా..ఆఆ..
పెదవిపైనే పవళించేనా..ఆఆ
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా..హైర హైర హైరబ్బా..

Thursday, June 18, 1998

జీన్స్ -- 1998


సంగీతం::A.R.రెహమాన్
రచన::A.M.రత్నం,శివగణేశ్
గానం::శ్రీనివాస్,బృందం


ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే

చెలియా నీకు నడమును చూశా
అరెరే బ్రహ్మింత పిసనారి
తలపెకైత్త కళ్లు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కొంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టినా స్ర్తీలందరిలో నీవే నీవే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట గోరమటా
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే..

అందమైన పువ్వా పువ్వా చెలి కురులు సొరభి తెలిపేనా
అందమైన నదివే నదివే చెలి మీటి సొగసు తెలిపేనా
అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేనా
అందమైన మణివే మణివే గుండె గుబులు తేలిపేనా

చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి అక్కడ నీకొక గుడికడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జోకొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగా మంచు బిందువలే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును గంగాజలముగ సేవిస్తా

ప్రియా ప్రియా చంపొద్దే..
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే