Thursday, May 17, 2007

ఓ పాపాలాలీ!! రాగం::మోహన !! 1990


రచన::వేటూరి
సంగీతం::ఇళయరాజా , రాజశ్రీ
గానం::SP.బాలు
రాగం::::మోహన:::

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

!!మాటేరాని చిన్నదాని!!

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలె నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మొహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే...

!!మాటేరాని చిన్నదాని

ముద్దబంతి లేతనవ్వులే చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలిపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసిముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్ని ఇక నావే...

!!మాటేరాని చిన్నదాని

No comments: