Tuesday, August 31, 2010

అదుర్స్ -- 2009



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
ప్రోడ్యుసర్::వంశి మోహన్
డైరెక్టర్::VV.వినాయక్
గానం::రామజోగయ్య శాస్త్రి


నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమః
మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమః

ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళా

ఓ మనసే మరిగే సలసల
వయసే విర్గే ఫెళ ఫెళ
మతులే చెదిరే లా మహ బాగుందే నీ వంటి వాస్తుకళా

చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it !

చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా

ఓ ఓ ఓ కులుకులకు పత్రం పుష్పం .. తళుకులకు అష్ఠొత్తరం
ya .. that's the way I wann it
చమకులకు ధూపం దీపం .. నడకలకు నీరాజనం
yeh .. that's the way to do it

అడుగుకో పువ్వై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అంటుకు తిరిగేలా

ఓ చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it !

ఓ పురుషులను పగబట్టేలా .. సొగసు పొడి వెదజల్లకే
Ya.. This is the way I ???
వయసు మడి గది దాటేలా .. వగలతో వలలల్లకే
yeh....thats the way i was speeg
నీకేసి చూస్తే ధగ ధగ దరువేస్తుందే దిల్ తబలా
శివకాసి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా

ఓ చంద్రకళా..
One more time
చంద్రకళా..
That's the way we like it
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా

Thursday, August 19, 2010

లీడర్ -- Leader -- 2009







సంగీతం::మిక్కీ జే మేయర్
రచన::వేటూరి
గానం::నరేష్ అయ్యర్,శ్వేతా పండిట్


అవుననా..కాదనా..నాదనా..ఓ ఓ ఓ
లేదనా..రాదనా..వేదనా..ఓ ఓ ఓ
మూగవైనా..రాగమేనా
నీటిపైనా..రాతలేనా

అవుననా..కాదనా..నాదనా..ఓ ఓ ఓ
లేదనా..రాదనా..వేదనా..ఓ ఓ ఓ

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరూ వెల్లువైతే వెన్నెలే కాబోలూ
నింగి నేలా ఏకమైనా పొద్దులో సింధూరాలు
నీకు నేనూ చేరువైనా ఎందుకో దూరాలు

దొరికిందీ..దొరికిందీ..తోడల్లే దొరికిందీ హో
కలిసిందీ..కలిసిందీ..కనుచూపే కలిసిందీ..2

ఇందుకేనా...ప్రియా
ఇందుకేనా.......

అవుననా..కాదనా..నాదనా..ఓ ఓ ఓ
లేదనా..రాదనా..వేదనా..ఓ ఓ ఓ

ఆ..ఆ..ఆ..ఆ
ఆశలన్నీ మాసిపోయీ ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలే పూసేలా
పూలజడలో తోకచుక్కా గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీలా రక్తధారా బాధలై పోయేలా

తెలిసిందీ..తెలిసిందీ..నిజమేదో తెలిసిందీ
కురిసింది..విరిసింది..మెరుపేదో మెరిసిందీ..2

అందుకేనా..ప్రియా
ఇందుకేనా......

అవుననా..కాద..నాద...ఓ ఓ ఓ
లేదనా..రాదనా..వేదనా..ఓ ఓ ఓ

Monday, August 9, 2010

దేవుళ్ళు--2000::Devullu--2000




Director::Kodi Ramakrishna
సంగీతం::వందేమాతరం శ్రీనివాస్
రచన::జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం::S.జానకి
CAST::RamyaKrishna, Raasi, Srikanth, Laya

పల్లవి::

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

చరణం::1

ఓంకార రావాల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను
కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు
తపమును గావించెను
పరమశివుని మెప్పించి
పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియూ జేజేలు పలుకగ
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు
కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల
అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం
కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి
ఇదియే ముక్తి దీపం

చరణం::2

దేవీ నవరాత్రులలో
వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన
కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే
బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే
సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనులకం
దించే దివ్యరూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గానమొసగు
వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు
ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిణి
మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి
శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా
నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

Devullu--2000
Music::Vandemataram Srinivas
Director::Kodi Ramakrishna
Lyricist::Jonnavittula RamaLingeswara Rao
Singer's::Janaki
Cast::RamyaKrishna, Raasi, Srikanth, Laya

:::

Maha kanaka durga vijaya kanaka durga
paraashakti lalita shivananda charita
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita
shivankari shubhankari poornachandra kaladhari
brahma vishnu maheshwarula srushtinchina moolashakti
ashtadasha peethalanu adhishtinchu aadishakti
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita

:::1

Omkaara ravaala alala krishnateeramlo
indrakeela giripaina velasaenu krutayugamulona
ee kondapaina arjunudu tapamunu kavinchenu
paramashivuni meppinchi paashupatamu pondaenu
vijayudaina arjununi parita vijayavada ayinadi ee nagaramu
jagamulanniyu jejelu palukaga kanakadurgakainadi sdhiranivasamu
melimi bangaru muddapasupu kalagalipina vennelamomu
koti koti prabhataala arunimaye kunkuma
amma manasupadi adigi dharinchina krishnaveni mukkupudaka
prema karuna vaatsalyam kuripinche durdaroopam
mukkoti devatalandariki idi illae puttideepam

Mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita

:::2

Devee navaraatrulalo vedamantra poojalalo
svarna kavachamulu dalchina kanakadurgadevi
bhavabandalanu bape bala tripurasundari
nityaanamdamu koorche annapoornadevi
lokashantine samrakshinche sumantramoorti gayatree
akshaya sampadalenno avani janula kandinche divya roopini mahalakshmi
vidya kavana gana mosagu vedamayi sarasvati
ayurarogyaalu bhogabhagyamulu prasaadinche mahadurga
shatru vinasini satyasvaroopini mahishasuramardhini
vijayakarini abhaya roopini sreerajarajeshwari
bhaktulandariki kannula panduga amma nee darshanam durgamma nee darshanam

Mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita