Friday, May 23, 2008

ద్రోహి~~2007


సంగీతం::హరిస్ జయరాజ్
సాహిత్యం::వెన్నెలకంటి
గానం::రఘు కుంచె,నాగ సాహితి


నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే..కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే

హ్మ్..నాలో రగిలే..తీయని మంటా..నేడెందుకనీ
హ్మ్..కోరికలన్నీ..తారకలాయే..ఏ విందుకనీ

నీ తలపున..నీ తలపునా
నా మనసు కవితైపోయే
నీ రెప్పలే..కను రెప్పలే
కంటిపాపగ దాచెను హాయే

ఒడిలో రేగు విరహం..అది కోరెనే చిలిపి సరసం
తగనీ వలపు మోహం..అది తగవే తీరు స్నేహం
తరగనిదీ..కరగనిదీ..వగలన్ని సెగలైన చలీ
తొలిముద్దు నన్నే..బులిపించగానే..దినం దినం నిన్నే చూడగా

నీ తలపున..నీ తలపునా..నా మనసు కవితైపోయే
నీ రెప్పలే..కను రెప్పలే..కంటిపాపగ దాచెను హాయే

బుగ్గలా పాలమెరుపూ..అది తగ్గలేదింత వరకూ
మోహం రేపు కలగా..తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో..కసికతలే..తెలిపెను చిలిపిగ చెలీ
ముద్దు ముత్యాలన్నీ..మోవి దిద్దగానే..ఎగిసెను నాలో ప్రాయమే

నీ తలపున..నీ తలపునా..నా మనసు కవితైపోయే
నీ రెప్పలే..కను రెప్పలే..కంటిపాపగ దాచెను హాయే

హ్మ్..నాలో రగిలే..తీయని మంటా..నేడెందుకనీ
హ్మ్..ఓ..ఓ..హో..కోరికలన్నీ..తారకలాయే..ఏ విందుకనీ
హో...ఆ...ఆ...ఆ..ఆ..ఆ...హొం..ఆ..ఆ......

No comments: