Wednesday, October 16, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013

సంగీతం::మిక్కీ జె మేయర్
రచన:: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం::శ్రీరామ చంద్ర 

మరీ అంతగా..మహా చింతగా..మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా
మతోయెంతగా..శృతే పెంచక విచారాల విల విలా
సరే చాలిక..అలా జాలిగా తికమక పడితె ఎలా
కన్నీరై కురవాలా..మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా..నిను చూడాలంటే అద్దం జడిసేలా
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా..కదా..మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల

మరీ అంతగా..మహా చింతగా..మొహం ముడుచుకోకలా
సరే చాలిక..అలా జాలిగా తికమక పడితె ఎలా

ఎండలను దండిస్తామా..వానలను నిందిస్తామా..చలినెటో తరిమేస్తామా..చీ పొమ్మనీ
కస్సుమని కలహిస్తామా..ఉస్సురని విలపిస్తామా..రోజులతొ రాజీ పడమా..సర్లెమ్మనీ
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం 
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా..కదా..మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల

చమటలేం చిందించాలా..శ్రమపడేం పండించాలా..పెదవిపై చిగురించేలా..చిరునవ్వులు
కండలను కరిగించాలా..కొండలను కదిలించాలా..చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు
మనుషులనిపించే ఋజువు..మమతలను పెంచే ఋతువు..
మనసులను తెరిచే హితవు..వందేళ్ళయినా వాడని చిరునవ్వు

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా..కదా..మరెందుకు గోల
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల

Seethamma Vaakitlo Sirimalle Chettu--2013
Music::Mickey J Mayer
Lyricis::Sirivennela Sitarama sastry
Singer's::Srirama Chandra 

Mari anthaga maha chintaga moham muduchukokala
panem tochaka pareshan ga gadabida padaku ala
mathoyentaga sruthe penchaka vicharala vila vila
sare chalika ala jaliga tika maka pedithe ela
kannerai kuravala mana chuttu unde lokam tadisela
mustabe chedarala ninu chudalante addam jadisesla
ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala
Mari anthaga maha chinta ga moham muduchukokala
sare chalika ala jaliga tika maka pedithe ela

:::::1

Endalanu dandistama vanalanu nindistama 
chalineto taramestama chi pommani
kassumanai kalahistama ussurani vilapistama 
rojulatho raaji padama sarlemmani
sati manushulatho matram saganani enduku pantham
pootakoka pechi padutu em sadhistamante em chebtam

ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala

:::::2

Chamatalem chindinchala sramapadem pandinchala
pedavipai chigurinchela chirunavvulu
kandalanu kariginchala kondalanu kadilinchala 
chichi chedi sadhinchala sukha santhulu
manushulani pinche rujuvu
mamatalanu penche ruthuvu
manasulanu teriche hitavu
vandellayina vaadani chirunavvu

ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola
ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala

No comments: