Monday, October 21, 2013

ఆవారా--2010






















ఆవారా
రచన::భువనచంద్ర 
సంగీతం::యువన్ శంకర్ రాజా
గానం::బెన్నీ దయాల్ 

పల్లవి::

పచ్చని మందార పూవల్లె వచ్చిందిరా 
వెన్నెల్లో మల్లల్లె సంతోషమిచ్చిందిరా 
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి 
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
ఎదలో ఎంతున్నా ఒక మాటే రాదే 
నా కళ్ళల్లోనా అరె కలలే రావే

పచ్చని మందార పూవల్లె వచ్చిందిరా 
వెన్నెల్లో మల్లల్లె సంతోషమిచ్చిందిరా 

చరణం::1

మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసేనే
తొలిచూపే విరి తూర్పై ఎద తలుపుని మెరుపల్లె తట్టివేసేనే 
అద్దాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పొదిగానే
పిల్లా నే నీ ముందు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే 
పురివిప్పే మేఘాన్ని ఒడిలో తారగా నిను తలిచా 
వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి ఎద మరిచా 

పచ్చని మందార పూవల్లె వచ్చిందిరా 
వెన్నెల్లో మల్లల్లె సంతోషమిచ్చిందిరా 

చరణం::2

అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే
కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే
ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా 
ఆగంటూ నిలదీసే రహదారి దీపాన్ని నిలుచున్నా వెలిగున్నా 
మది తొలిచే పాటలకి అర్ధాలే నీవని మురిసితినే
ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే

నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి 
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
ఎదలో ఎంతున్నా ఒక మాటే రాదే 
నా కళ్ళల్లోనా అరె కలలే రావే

పచ్చని మందార పూవల్లె వచ్చిందిరా 
వెన్నెల్లో మల్లల్లె సంతోషమిచ్చిందిరా 

Awaara
Music: Yuvan Shankar Raja
Lyrics::Bhuvanachandra
Singer's::Benny Dayal

:::::

Pacchani mandhaara puvalle vacchindhiraa
Vennello mallalle santhoshamicchindhira
Naa gundello veeche sumagandhala gali
Thana kallallo perche pasiparuvala doli
Yedhalo enthunna oka maate raadhe
Naa kallallona are kalale raave..

Pacchani mandhaara puvalle vacchindhiraa
Vennello mallalle santhoshamicchindhira

:::::1

Madhilo mounam ragile vela 
Konchem moham daaham chuttivesene
Tholichupe viri thoorpai 
Yedha thalupuni merupalle thattivesene
Addhaanni sarichesi manasantha kallallo podhigane podhigane
Pilla nen nee mundhu muripaala valapullo thadisane thadisanne
Purivippe meghaannai odilo thaaraga ninu thalicha
Vesavilo velluvanai bhuggalu thaaki yedha marichaaa...

Pacchani mandhaara puvalle vacchindhiraa
Vennello mallalle santhoshamicchindhirai

:::::2

Alalaaga kudhipese thana peruni vinte parimalame
Kalalone kanipinche thana nagavulu kante paravasame
Enaati oosulno enaati baasalno vintunna vintunnaa
Aagantu niladheese rahadhaari deepaannai niluchunna veligunnaa
Madhi tholiche paatalaki ardhaale neevani murisithine
Oka nadhila neevosthe baga dhooram tharigenule

Naa gundello veeche sumagandhala gali
Thana kallallo perche pasiparuvaala doli..
Yedhalo enthunna oka maate raadhe
Naa kallallona are kalale raave..

Pacchani mandhaara puvalle vacchindhiraa
Vennello mallalle santhoshamicchindhira

No comments: