Monday, July 11, 2011

100% లవ్ Love--2011



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
గానం::టిప్పు

దూరం దూరం దూరం
ఓ..తీరం లేని దూరం

ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా
చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ..ఒకే నిజాన్ని ఉరేసినారే
చెరో సగాన్ని ఓ..మరో జగాన్ని వరించినారే

ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం
ఓ..తీరం లేని దూరం

ఇంత దగ్గర అంతులేని దూరం
ఇంత కాలము దారిలేని దూరం
జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే
స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే
విరహాల చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే

ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం
ఓ..తీరం లేని దూరం

ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్లలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే
మైలు రాయికొక మాట మార్చు దూరం
మలుపు మలుపుకొక దిక్కు మార్చు దూరం
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్లబాటగ మార్చే
తుదిలేని జ్ఞాపకాన్ని తుడిచివేసే దూరమన్నది
మొదలైన చోటు మరచిపోతె కాదే పయనమన్నది

ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం
ఓ..తీరం లేని దూరం

No comments: