Sunday, November 22, 2009

ఏక్ నిరంజన్ ~~2009



సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::కార్తీక్


సమీరా..సమీరా..
సమీరా..సమీరా..

ఒక్కసారి ఐ లవ్ యూ అనవే సచ్చిపోతా
ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా
నువ్వొక్కసారి 143 అనవే రాలిపోతా
నీ లవ్వు కన్న లక్కేదీ లేదని రేగిపోతా

యహ సైట్లు ఏ కోట్లు వద్దు నా కోహినూరు నువ్వంటా
ఏ పాట్లు రాని అగచాట్లు రాని నీ ప్రేమతో బ్రతికేస్తా

నిను దేవతల్లే పూజిస్తా
ఓ దెయ్యమల్లే సాధిస్తా
నువ్వు లొంగనంటే ఏం చేస్తా
నే బ్రహ్మచారిగా పుచ్చిపోతా
సమీరా...సమీరా....
సమీరా...సమీరా....

నీ ఇంటిముందు టెంటు వేసుకుంటా..మైకు పెట్టి రచ్చ రచ్చ చేస్తా
అప్పుడైనా తిట్టుకుంటు చెప్పవే ఐ లవ్ యూ..
వీధి వీధి పాదయాత్ర చేస్తా..సంతకాలు లక్ష సేకరిస్తా
అందుకైనా మెచ్చుకుంటు అనవే 1..4..3...

అసలెందుకంట నేనంటే మంట తెగ చిటపటమంటావే
కొవ్వున్న చోట లవ్వుంటదంట అది నిజమని అనుకోవే
బతి మాలీ గతి మాలీ అడిగా నిన్నే

సమీరా...సమీరా....
సమీరా...సమీరా....

దండమెట్టి నిన్ను కాక పడతా..దండలేసి కోకనట్సు కొడతా
వెయ్యి పేర్లు దండకాలు చదువుతూ ప్రేమిస్తా..
తిండి మాని బక్కచిక్కిపోతా..మందు దమ్ము అన్ని మానుకుంటా
ఏడుకొండలెక్కి గుండుకొడతా ఏటేటా

నీకోసమింత నే చేస్తున్నదంత నువు చూసీ చూడవుగా
ఏ మాయసంత అని తిప్పుకుంటూ పోతే నే వదలనుగా
వెనకొస్తా..విసిగిస్తా..నువు మారేదాకా

No comments: