Sunday, November 22, 2009

ఆర్య 2 ~~ 2009 ( Arya )



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::వనమాలి
గానం::కునాల్ గంజావాలా,మేఘ


కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమా !

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

పరుగులు తీస్తూ..అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికీ చేరువ కాను
నిదురను దాటీ నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయ్యిందా..ఓ ఓ ఓ
నా సగమేదో ప్రశ్నగ మారిందా..ఓ ఓ ఓ
నేడీ బంధానికి పేరుందా..ఓ ఓ ఓ
ఉంటే విడదీసే వీలుందా..ఓ ఓ ఓ

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వులతోనే
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటని చూస్తుంటే..ఓ ఓ ఓ
నా బాధంతటి అందంగా ఉందే..ఓ ఓ ఓ
ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే..ఓ ఓ ఓ
మరుజన్మే క్షణమైనా చాలంతే..ఓ ఓ ఓ

కరిగే లోగా ఈ క్షణం..గడిపేయాలీ జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం..అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా !

గడిచే నిమిషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమా

No comments: