Saturday, May 23, 2015

పైసా--2013



సంగీతం::సాయ్ కార్తీక్ 
రచన::సిరివెన్నెల
గానం::శ్వేతమోహన్,సై కార్తీక్  

పల్లవి::

అతడు::ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే

ఆమె::నీతో ఏదో అందామనిపిస్తుంది
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది
నా పుట్టుక నీతో మొదలైందీ
నీతోనె పూర్తయిపొతోంది
ఇంకెలా..చెప్పనూ..మాటల్లొ వివరించి
నీకెలా..చూపనూ..నా మనసును ఇంతకుమించి

నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది

అతడు::ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే

చరణం::1

ఆమె::కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంటా
ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా
నువు నను పిలిచేటపుడే నా పెరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఎమవుతావు నువు అంటె ఏమొ తెలియదు కాని
ఏమి కావు అంటె లోలో ఏదొ నొప్పిగ ఉంటుందె

అతడు::ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే

చరణం::2

ఆమె::తెలియని దిగులవుతుంటే నిను తలిచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తుందే ఆ గుబులు
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టే ఒల్లంత గుమగుమలు
వనకడమంటే ఏమిటంటె సరిగ తెలియదు కాని
నువ్విలాగ నవ్వుతుంటె చూస్తు ఉండడమనుకోని

అతడు::ఈరోజె వయ్యాసయ్యారే హరె మొరేస
ఈరోజె వయ్యాసయ్యారే...

ఆమె::నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడూ నీతో ఉండాలంపిస్తోంది

Paisa--2013
Music::SaiKartik
Lyrics: Sirivennela Seetharama Sastry
Singers: Shwetha Mohan, Sai Karthik

:::

Eroje mayya sayya re hare more sa
Eroje mayya sayya re hare more sa

Netho edo andamanipistondi
Epudu neetho vundalanipistondi
Naa puttuka neetho modalayindi
Neethone purthaipotundi
Inkela cheppanu matallo vivarinchi
Neekela chupanu naamanasinthaku minchi
Netho edo andamanipistondi
Epudu neetho vundalanipistondi

Eroje mayya sayya re hare more sa
Eroje mayya sayya re 

Kantiki nuvu kanipiste vudayam ayindanta
Intiki po ante sayantram anukunta
Nuvu nanu pilichetapude naa peruni gurtista
Nee vaipuki kadile adugulne nadakanta
Emavtaavu nuvu ante emo teliyadugani
Emi kaavuante lolo edo noppiga vuntundi

Eroje mayya sayya re hare more sa
Eroje mayya sayya re

Teliyani digulavutunte ninu talachi gundello
Tiya tiyaga anipistonde aagubulu
Muchhematalu postunte vechani nee vuhalo
Mallellau pustunaattolantha ghuma ghumalu
Bathakadamante emitante sariga teliyadu gani
Nuvvilaga navvutunte chustu vundadamanukoni

Eroje mayya sayya re hare more sa
Eroje mayya sayya re

Netho edo andamanipistondi
Epudu neetho vundalanipistondi 

No comments: