Saturday, December 12, 2009

జోష్ ~~~ 2009



సంగీతం::సందీప్ చౌట
రచన::
గానం::సౌమ్య రావ్


నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట

నువ్వు చూసొచ్చిన ప్రతి వింతా
నేనేవ్వరికి చేపోద్దా
నీ ఊసులనే ఊ కొడుతూ వింటా
ఒక్క చోట నిలవోద్దు అంటు తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావ సాయపడతావా 2

నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట

వేళ పాల గోలి మార్ విసిరేసా చూడు బాచి ని
అపుడప్పుడు నవ్వుతామ టైం టేబుల్ వేసుకొని
దాగుడు మూత దండకోరు
ఎవ్వరికి జాడ చెప్పమని
యిట్టె తప్పించుకోమ ఆపేసే చూపుల్ని
పద్దతంటు పట్టించుకోని పాటల్లె సాగని పొద్దంతా
వొద్దు అంటు ఆపేది ఎవ్వరంటా
కాటుక పిట్టల్లా కల్లగిరి వాలిన చోటెల్లా
ఎన్ని వర్ణాల్లో చూడిల్లా తెలుగు పువ్వుల్లా

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా

కిటికీ లోంచి చూడాలా కదిలల్లె అన్ని ఋతువుల్నీ
చెయ్యరా తాకరాద వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురోచే చిన్ని ఆశలనీ
గుండెల్లో చోటు లేదా ఊరించే ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశం అందుకుంటా

ఎల్లలు ఆగేనా అల్లరిగా దూగే వేగాన
అదుపులో ఉంచే వీల్లేదా నన్ను నేనైనా

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా

నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట 2

No comments: