Monday, August 10, 2009

జోష్ ~~~ 2009



సంగీతం::సందీప్ చౌట
రచన::సిరివెన్నెల
గానం::కార్తీక్
డైరెక్టర్::వాసు వర్మ
ప్రొడ్యుసర్::దిల్ రాజు
నటీ,నటులు::కార్తీక,నాగచైతన్య


నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఏమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చలు
మున్ముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు

కాలాన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు

నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు
సెలయేళ్ళు చిత్రంగా నీ వైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు
రాగాలూ నీలాగ నలువైపులా
భూమి అంతా నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంతా నీ తరంగానికి సొమ్మసిల్లిపోదా
చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చెదైన తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంక కోనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు

నువ్వేం చూస్తున్న యెంతో వింతల్లే
అన్ని గమనించే ఆశ్చర్యమా
ఏ పని చేస్తున్నా ఏదో
ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చుపుల్లో కొలువు ఉండి పోగా
చీకటన్నది ఇక రాలేదే నీ కంటి పాప దాకా
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వలా గుంపై వాలు
కాలన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు

No comments: