Friday, June 12, 2009

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::కారుణ్య,ప్రణవి

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
చూపుతోనే రేగేనే ప్రేమనే భావన
చినుకులా కలిసేనా చిగురు తోడిగేనా
వరదలా ముంచేనా ఈ కలల ఆలాపన

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
నీ చూపుతోనే రేగేనే ప్రేమనే భావన

వద్దు గురువా ప్రేమ గొడవా.. జిందగీ సిందరవందర
కళ్ళు మూసి బ్లైండ్ గా సుందరి మోజు లో దెబ్బైపోకుర
రోమియో లా జూలియట్ తో డ్యూయట్టు కి ఏందిర తొందర?
సిన్సియర్ గా నువ్విలా పోయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోకురో

వెన్నెల మెరుపంటి సన్నజాజి సోయగమంతా
నీ కందిస్తా నిధిగా
తియ్యని ఎరుపౌతా నీ పెదాలనంటే ఉంటా
పోలేనంటా విడిగా

ఎదలయ మురిసే పిలుపుల వలలో ముడిపడిపోతా చనువుగా
కుదురును చెరిపే కులుకుల జతలో వసంతాలు చూస్తా
అందీ ఆనందం చెరి కొంత

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ కత్తెర కత్తెర
ఆచి తూచి బురదలో అడుగెయ్యొద్దురా అల్లరి గాకురో
మజ్ను లాగా ఫీల్ అయిపోయి లైలా తో లింకయిపోకురో
ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే పరువే పోద్దురో

లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
దణ్ణం పెడతా బిడ్వ పిల్లా గాలీ అస్లే వద్దు
లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
వద్దు వద్దు వద్దు వద్దు వద్దుర బాబు వద్దు

నాలో లోలోన నిన్ను బందీ చేసేస్తున్నా
మన్నిస్తావా మదనా
తెలుసా నా కన్నా ఎక్కువే నిను ప్రేమిస్తున్నా
తీరేదేనా తపన

ఒకరికి ఒకరై ఒదిగిన కధలో ఎవరెవరంటే తెలియదే
వెనుకటి రుణమే వదలని వరమై ఇలా చేరుకుందే
జన్మాలెన్నైనా చెలి నీదే

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ గజిబిజి గత్తర
ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే పోకురా
దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా
జరగబొయే సంగతి హిస్టరీ మనకు ముందే తెలిపెరా

No comments: