Friday, April 17, 2009

కొంచం ఇష్టం--కొంచం కష్టం--2009





సంగీతం::శంకర్,ఎహసాన్ ,లోయ్
రచన::చంద్రబోస్
గానం::క్లింటన్ సెరెజా,హేమచంద్ర,రమణ్ మహదేవన్,షిల్పా రావ్


ఎగిరే..ఎగిరే..ఎగిరే..ఎగిరే
చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో
fly high in the sky
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా

మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇపుడే
ఏపుడూ చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇచటే
ఓ..ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం..తెలిసింది ఈ క్షణం
మౌనం కరిగెనే మాటలు సూర్యుడి ఎండలో
స్నేహం దొరికెనే మబ్బుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగిలో
fly high in the sky
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా

తెలుపు నలుపే కాదురా పలురంగులు ఇలా సిద్దం
మదిలో రంగులు అద్దరా మన కధలకు అదే అర్ధం
ఓ..సరిపోదోయ్ బతకడం నేర్చేయ్ జీవించడం
గమనం గమనించడం పయనంలో అవసరం
చేసెయ్ సంతకం నడిచే దారపు నుదుటిపై
రాసెయ్ స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచెయ్ సురినిరం కాలం చదివే కవితపై
fly high in the sky
ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగు స్వేచ్చ కోరగా

No comments: