Monday, May 18, 1998

జీన్స్ -- 1998


సంగీతం::A.R.రెహమాన్
రచన::A.M.రత్నం, శివగణేష్
గానం::a.r.రెహమాన్,బృందం

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

సెలవు సెలవు సెలవు
కనుగొను కొత్త దీవి నీవు (2)

శని ఆదివారాల్లేవని అన్నవీ ఓహో
మనుషుల్ని మిషన్‌లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం
ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్
పొల్యూషన్ ఏదీ చొరబడ లేని
దీవి కావాలి ఇస్తావా

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం
వారం రెండునాళ్ళు ప్రకృతికి అంకితం
వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు
మనస్సులు చక్కబెట్టు
మళ్లీ పిల్లలౌతాం వలలంటా ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే
ఒంటికి తొడిగి పెకైగురూ
పక్షులకెన్నడూ పాస్‌పోర్ట్ లేదు
ఖండాలన్నీ దాటెళ్ళు
నేడు విరామమేగవద్దు అయినా
విశ్రమించలేదు
నేడు నిర్వాణా చేపలల్లే ఈదుదాం..

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

నడిచేటి పూలను కొంచెం చూడు
నేడైనా మడిమణిగాను లవ్వరైతే లేదు
అల నురగలు తెచ్చి
చెలి చీరే చెయ్యరారాదా
నెలవంకను గుచ్చి
చెలి మెడలో వెయ్యరారాదా
వీకెండు ప్రేయసి ఓకే అంటే ప్రేమించు
టైంపాసింగ్ ప్రేమలా
పూటైనా ప్రేమించు
వారం రెండునాళ్ళు వర్థిల్లగా...

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి

No comments: