Sunday, January 13, 2008

ఇష్ గప్ చుప్ -- 1993

సంగీతం::రాజ్ - కోటి
గానం:;బాలు,చిత్ర

స నిసగరిసని..గమద సనిదప
పపమ పపమ పపమ పమగమ
స నిసగరిసని..గమద సనిదప
పపమ పపమ పపమ పమగమ

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై

సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సగమప దపమగ దపదప దపమగ
సగమప దనిసరి మగరిస నిదపమ

తిక్కనలో తియ్యదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం నవ పద్మావతీ పాదం
రాగానికే అందం రసగీత గోవిందం
వంశధార ఒడిలో హర్ష వల్లికా
సూర్యకాంత విరిలో రాగదీపిక

సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

సామ గమగమ సమాగ రిసనిద
సాససనిరీ రీరి రిసగా
సామ గమగమ సమాగ రిసనిద
సాససనిరీ రీరి రిసగా

క్షేత్రయలో జాణతనం
వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం
అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మల గంధాలివి
క్రిష్ణవేణి జడలో శైవ మల్లికా
శివుడి ఆలయాన భ్రమర దీపిక
సాగపా దాపపా దాస సారీసదా
సాగపా దాపపా దాస సారీసదా
కాటుకా కళ్ళలో కన్నె వాకిళ్ళలో

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా